మోడీ నాయకత్వం బలపరుస్తూ బిజేపిలో భారీగా చేరికలు
వరంగల్, అక్షిత బ్యూరో:
కాజీపేట బాబుజి నగర్ వాసులు సుమారు 25 మంది బిజెపి పార్టీ సీనియర్ నాయకులు మాజీ కార్పొరేటర్ నార్లగిరి రామలింగం రంజిత్ ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిజెపి పార్టీ వరంగల్ ఎంపీ అభ్యర్థి ఆరూరి రమేష్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా నార్లగిరి రామలింగం మాట్లాడుతూ మూడోసారి నరేంద్ర మోడీ ని ప్రధాని చేయాలని లక్ష్యంతో యువత మహిళలు పార్టీలో చేరడం జరుగుతుంది. అతి తొందరలో కూడా బాబుజి నగర్ కాజీపేట నగరవాసులు బిజెపి పార్టీలో భారీ ఎత్తున చేయడం జరుగుతుంది. ఎంపీగా ఆరూరి రమేష్ గెలుపుకు ప్రతి ఒక్కరు సహకరించాలని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో రవి, శిరీష్ కుమార్ ,జి.రవి, కె ఫణింద్ర ,ఎం నరేంద్ర ,జి విజయ, జి అనిత, విక్టర్ ,అజయ్ కుమార్, జయశంకర్ తదితరులు పాల్గొన్నారు.