పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి
చేర్యాల(మద్దూరు)ఏప్రిల్ 13 అక్షిత ప్రతినిధి: మద్దూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సలాక్ పూర్ గ్రామ శివారులోని ఒక పశువుల పాకలో కొంతమంది వ్యక్తులు కలిసి పేకాట ఆడుతున్నారని నమ్మదగిన సమాచారంపై, శనివారం సిద్దిపేట జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీస్ అధికారులు మరియు మద్దూర్ ఎస్ ఐ యునస్ అహ్మద్ అలీ సిబ్బందితో వెళ్లి పేకాట స్థావరంపై రైడ్ చేసి 6 గురిని అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుండి 70,000/- రూపాయల నగదు మరియు 6 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని, నిందితులపై కేసు నమోదు చేసినట్లు ఎస్ ఐ తెలిపారు. నిందితులది సలాకాపూర్ గ్రామ వాసులేనని వారిలో కాసు ఇన్నారెడ్డి, విరుపాక మహేందర్ రెడ్డి,యిన్నం దినేష్,ఇరువ రంజిత్ రెడ్డి, మామిడి గోపికృష్ణ,దేవీ భూపాల్ ఉన్నారని తెలిపారు.ఈ సందర్భంగా టాస్క్ ఫోర్స్ అధికారులు మాట్లాడుతూ బహిరంగ ప్రదేశంలో కానీ ఇళ్లల్లో గానీ పేకాట జూదం ఆడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు