మహనీయుల ఆలోచనలకు తిలోదకాలు
బిజెపి పాలనలో దళితులపై పెరిగిన దాడులు
బిజెపి చెర నుండి రాజ్యంగాన్ని కాపాడుకోవాలి
సామాజిక విశ్లేషకులు విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు అంబటి నాగయ్య
నల్గొండ, అక్షిత ప్రతినిధి :
సామాజిక సాంస్కృతిక విప్లవాలకు నాంది పలికిన మహాత్మ జ్యోతిరావు పూలే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనలను పాలకులు కనుమరుగు చేస్తున్నారని విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు అంబటి నాగయ్య అన్నారు.మహనీయుల జయంతులను పురస్కరించుకొని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం(కెవిపిఎస్) ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఎంవిఎన్ ట్రస్ట్ భవన్ లో మహాత్మ జ్యోతిబాపూలే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలంకరణ చేయడం జరిగింది. అనంతరం మెగా రక్తదాన శిబిరాన్ని కార్డియాలజీ డాక్టర్ పగిళ్ల ధరణిధర్ ప్రారంభించారు. నల్లగొండ ప్రభుత్వ దవాఖాన రక్తనిధి కేంద్రానికి దాతల ద్వారా సేకరించారు. అనంతరం “77 ఏళ్ల స్వతంత్ర భారతం దళితుల స్థితిగతుల”నే అంశంపై జరిగిన సదస్సుకు కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు కొండేటి శ్రీను అధ్యక్షత వహించడం జరిగింది.
ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన సామాజిక విశ్లేషకులు విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు అంబటి నాగయ్య మాట్లాడుతూ ఈ దేశంలో వెనుకబడిన దళితులకు, ఆదివాసులకు,ప్రత్యేకమైన హక్కులు కావాలని పూలే అంబేడ్కర్ లాంటి మహనీయులు కొట్లాడితే వారి హక్కులనే కాలరాయడమే టార్గెట్ గా పెట్టుకొని బిజెపి పాలిస్తుందని అన్నారు.బిజెపి అధికారంలోకి వచ్చిన పదేళ్ల కాలంలో దళితుల పైన ఆదివాసీల పైన దాడులు తీవ్రతరం అయ్యాయని నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో నివేదికలే స్పష్టం చేస్తున్నాయన్నారు. దేశంలో పెరిగిపోయిన నిరుద్యోగిత, పౌష్టికాహార లోపం, పెరిగిన శిశు మరణాల రేటు దళితుల స్థితిగతులను తెలియజేస్తున్నాయన్నారు.డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వ్రాసిన రాజ్యాంగం ద్వారా కాస్తో కూస్తో హక్కులను చైతన్యాన్ని పొందిన ఆదివాసి దళిత గిరిజనుల పట్ల పాలకులు వివక్షత చూపుతున్నారన్నారు. భారత రాజ్యాంగం స్థానంలో మనుధర్మ రాజ్యాంగాన్ని తేవడానికి బిజెపి ప్రభుత్వం అనేక కుటిల ప్రయత్నాలు చేస్తుందన్నారు. కేంద్రంలో బిజెపి అధికారంలోకి రాకుండా నిలువరించాల్సిన బాధ్యత ఆదివాసి దళిత గిరిజన సమాజంపై ఉందన్నారు.అసంఘటిత రంగంలో కార్మికులంతా దళిత బలహీన వర్గాలేనని వారి హక్కులను సమూలంగా తొలగించేందుకు బిజెపి ప్రభుత్వం కొత్త కార్మిక చట్టాలను తీసుకొచ్చి కార్పొరేట్ శక్తులకు లాభాలను చేకూరుస్తుందని వారన్నారు.ఈ దేశంలో బిజెపిని నియంత్రించి లౌకిక శక్తులకు అండగా నిలవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.

కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి పాలడగు నాగార్జున మాట్లాడుతూ పూలే అంబేడ్కర్ ఆలోచనలను ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత దళిత ఆదివాసి బహుజన సమాజంపై ఉందని అందులో భాగంగానే కెవిపిఎస్ ప్రతి ఏటా పూలే అంబేద్కర్ జన జాతర నిర్వహించడంతో పాటు భిన్న రూపాలలో మానీయుల స్ఫూర్తిని సమాజంలోకి తీసుకుపోతుంధన్నారు.మహనీయులు ఈ దేశ ప్రజలకు కల్పించిన హక్కులను కాపాడుకోవడంలో భాగంగా ఆదివాసీ గిరిజన దళిత,బహుజ,మహిళా హక్కులకు,పౌరుల హక్కులకు ఎక్కడ భంగం వాటిల్లినా కెవిపిఎస్ స్పందించి అండగా నిలబడడంలో క్రియాశీలక భూమిక పోషిస్తుందన్నారు. పార్లమెంటులో దళిత ఆదివాసి గిరిజన హక్కుల కోసం అనేక చట్టాలు రూపొందిస్తున్నప్పటికీ ఆచరణలో అమలుకు నోచుకోవడం లేదన్నారు. మహనీయుల ఆలోచనలను సమాజానికి చేరువ చేయాల్సిన బాధ్యత పాలక ప్రభుత్వాలపై ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ రాష్ట్ర కమిటీ సభ్యుడు రెమిడాల పరుషరాములు, బీసీ సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి సత్యనారాయణ, యుటిఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల సైదులు,ప్రముఖ అడ్వకేట్ దర్శనం నరసింహ,విద్యావంతులు వేదిక జిల్లా అధ్యక్షుడు పందుల సైదులు,ఎంఎస్పి జిల్లా అధ్యక్షుడు బకరం శ్రీనివాస్,బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు అయితగోని జనార్ధన గౌడ్, ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి,మాల మహానాడు రాష్ట్ర నాయకుడు అద్దంకి రవీందర్,ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కట్టెల శివకుమార్,ఎం వి ఎన్ ట్రస్ట్ కార్యదర్శి పుచ్చకాయల నర్సిరెడ్డి,డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్ల మహేష్, దళిత నాయకులు ఒంటెపాక యాదగిరి ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆకారపు నరేష్ ఖమ్మంపాటి శంకర్,అభిలాష్ చారిటబుల్ ఫౌండేషన్ చైర్మన్ పేరుకే అభిలాష్,ఐద్వా రాష్ట్ర కమిటీ సభ్యురాలు కొండా అనురాధ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు సైదులు చాకలి ఐలమ్మ ట్రస్ట్ బాధ్యులు బొల్లెపల్లి మంజుల,కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కొడిరెక్క మల్లన్న,గాదే నరసింహ బొల్లు రవీందర్ కుమార్ పెరికే విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.