భవన నిర్మాణ కార్మికుల అడ్డ వద్ద చలివేంద్రం ఏర్పాటు చేయాలి..
మేడ్చల్, అక్షిత బ్యూరో : దుండిగల్ పురపాలక పరిది గండి మైసమ్మ చౌరస్తా.శనివారం.భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి రత్నాకరం కోటం రాజు గండి మైసమ్మ భవన నిర్మాణ కార్మికుల అడ్డాలో కార్మికులతో సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి సిఐటియు రాష్ట్ర కార్యదర్శి రత్నాకరం కోటం రాజు.పాల్గొని మాట్లాడుతూ ఎండాకాలం ఎండలు మండిపోతావున్న అడ్డాలలో చలివేంద్రాలు నేటికీ పురపాలక అధికారులు ఏర్పాటు చేయకపోవడం ఇందులో భాగంగా. కార్మికులకు షెడ్లు నిర్మించకపోవడం దురదృష్టకరమని ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పట్టించుకోవడంలేదని అన్నారు. కార్మికులకు వారంలో నాలుగు రోజులు మాత్రమే పని దొరుకుతుందని మిగతా రోజులు పని లేక ఇబ్బంది పడుతున్నారని వారికి ప్రభుత్వం తక్షణమే ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు గండిమైసమ్మ అడ్డాలో ఐదు రూపాయల భోజనాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అదేవిధంగా కార్మికులందరూ వెల్ఫేర్ బోర్డులో సభ్యులుగా చేరాలని కోరారు. కార్మికులకు సిఐటియు సంఘం ఎల్లవేళలా అండగా ఉంటాదని తెలిపారు అదే విధంగా సామాజిక ఉద్యమ నిధిని వసూలు చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో గండి మైసమ్మ అడ్డా నాయకులు కుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు భవన నిర్మాణ కార్మికుల సంఘం జిల్లా కార్యదర్శి లక్ష్మయ్య శ్రీనివాస్ నరసింహ శీను ఉపేందర్ రవి తదితరులు పాల్గొన్నారు..