పది రోజులు ధియేటర్లు బంద్
వరంగల్, అక్షిత బ్యూరో:
తెలుగు ప్రేక్షకులకు తెలంగాణ థియేటర్స్ అసోసియేషన్ ఊహించని షాక్ ఇచ్చింది.తెలంగాణ రాష్ట్రంలో పది రోజులపాటు థియేటర్లు బంద్ కానున్నాయి.* ఆక్యుపెన్సీ తక్కువ ఉండటంతో తెలంగాణ రాష్ట్రంలో సింగిల్ స్క్రీన్ థియేటర్ల యాజమాన్యాలు తాత్కాలిక విరామం ప్రకటించాయి. శుక్రవారం నుంచి పది రోజులపాటు షోలు వేయవద్దని తెలంగాణ థియేటర్స్ అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది. ఎన్నికలు అలాగే ఇతర కారణాలతో ఇటీవల పెద్ద సినిమాలు రిలీజ్ కావడం లేదు. దీంతో సినిమా హాళ్ళకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. నగరాలతో పోలిస్తే పట్టణాలు అలాగే మండలాలలో ఇది మరింత దారుణంగా ఉందంటూ.. తెలంగాణ థియేటర్స్ అసోసియేషన్ ఈమేరకు నిర్ణయం తీసుకుంది.