ఆపదలోఆపన్న హస్తం అందించిన అంబేద్కర్ యూత్

ఆపదలోఆపన్న హస్తం అందించిన అంబేద్కర్ యూత్

రూ.30 వేలు ఆర్ధిక సహాయం

వేములపల్లి, అక్షిత న్యూస్ :

ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలైన వేములపల్లి మండలం మొల్కపట్నం గ్రామానికి చెందిన జేరిపోతుల సతీష్ -స్టాలిన్ తోపాటు అదేగ్రామానికి చెందిన రెమడాల బిక్షం లు ఆర్థిక పరిస్థితి బాగులేక ఇబ్బందిపడుతున్నారు. ఇరువురి పరిస్థిని తెలుసుకున్న అంబేద్కర్ యూత్ మేమున్నామంటూ ముందుకు వచ్చి బుధవారం జెరిపోతుల సతీష్ -స్టాలిన్ కు రూ.25 వేలరూపాయలు, రెమడాల బిక్షం కు రూ.5వేలు నగదు ఆర్థిక సహాయం అందజేశారు. అంబేద్కర్ యూత్ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఆర్థిక సహాయం అందించిన యూత్ కమిటీ సభ్యులకు యూత్ కమిటీ అధ్యక్షులు రేమడాల సతీష్, ప్రధాన కార్యదర్శి వల్లమల్ల పరమేష్, ఉపాధ్యక్షుడు పుట్టల మాదేశ్, సహాయ కార్యదర్శి ఈట నాగరాజు, కోశాధికారి జేరిపోతుల తిరుమలేష్ లు ధన్యవాదములు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking