పట్టభద్రుల ఉప ఎన్నికకు బ్యాలెట్ బాక్స్ ల సిద్ధం

పట్టభద్రుల ఉప ఎన్నికకు బ్యాలెట్ బాక్స్ ల సిద్ధం

నల్గొండ జిల్లా కలెక్టర్
దాసరి హరిచందన

నల్గొండ, అక్షిత ప్రతినిధి :

రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం నుండి వరంగల్-ఖమ్మం-నల్గొండ శాసనమండలి నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణపై బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ కు
రిటర్నింగ్ అధికారి, నల్గొండ జిల్లా కలెక్టర్ దాసరి హరిచందనతో పాటు, ఈ నియోజకవర్గ పరిధిలో ఉన్న 12 జిల్లాల ఏఆర్వో లు నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి హాజరయ్యారు. ఈ శాసన మండలి ఉప ఎన్నికలో బ్యాలెట్ బాక్స్ లు, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, శిక్షణ కార్యక్రమాల నిర్వహణపై పలు సూచనలు చేశారు.శాసన మండలి ఉప ఎన్నిక నిర్వహణకు సరిపడా బ్యాలెట్ బాక్సులు ఉన్నాయని, ఎన్నికల కోడ్ ఉల్లంఘన, అనుమతులు, ఎన్నికల ప్రచారం, ఎన్నికల ర్యాలీలు, అభ్యర్థులు పాటించాల్సిన విషయాలపై, పాటించకూడని అంశాలపై అభ్యర్థులకు బుధవారం జరిగిన సమావేశంలో అవగాహన కల్పించామని రిటర్నింగ్ అధికారి, నల్గొండ జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన ఎన్నికల సంఘం అధికారులకు తెలిపారు.

బ్యాలెట్ పేపర్లు, పోస్టల్ బ్యాలెట్ లకు సంబంధించి ఏఆర్వోలు ఎప్పటికప్పుడు రిజిస్టర్ నిర్వహించాలని, అభ్యర్థులకు అనుమతులు మాన్యువల్ గా ఇవ్వాలని సూచించారు. పార్లమెంటు ఎన్నికల లాగానే ఎఫ్ ఎస్ టి టీమ్స్ కొనసాగుతాయని తెలిపారు.
అదనపు ఎన్నికల అధికారులు సర్ఫరాజ్ అహ్మద్,లోకేష్ కుమార్,డిప్యూటీ సి ఈ ఓ సత్యవాణి పాల్గొనగా,నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి మిర్యాలగూడ ఆర్ డి ఓ, ఏఆర్ ఓ శ్రీనివాసరావు, చండూరు ఆర్ డి ఓ,ఏ ఆర్ ఓ సుబ్రహ్మణ్యం తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking