అభివృద్దికి ఆమడ దూరం
చింతలపాలెం
మండల ప్రజలకు అందుబాటులో లేనటువంటి కనీస వసతులు
* విద్య వైద్యం, రవాణా సౌకర్యాల ఏర్పాటల్లో వెనుకంజ
*
చింతలపాలెం, అక్షిత న్యూస్:
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వాల పరిపాలన సౌలభ్యం కొరకు కొత్త మండలాలు ఏర్పాటు ప్రతిపాదనలో భాగంగా చింతలపాలెం మండల కేంద్రం ఒకదానిగా గుర్తించి నేటికీ ఏడు సంవత్సరాలు పూర్తి అయినప్పటికీ అధికారులు మరియు ప్రజాప్రతినిధులు కనీస సౌకర్యాలు కల్పించలేకపోయారు ఈ మండలంలో ఎక్కువగా వ్యవసాయం మరియు కూలీ పనులు చేసుకునేవారు జీవనం కొనసాగిస్తారువారికి ఏమైనా ఆరోగ్య సమస్యలు వచ్చినమరియు పొలం పనులు చేసేటప్పుడు పాముకాటులు లాంటి ప్రమాదాలు సంభవించిఅనేకమంది దూర ప్రాంతాలకు ప్రవేట్ ఆసుపత్రికివెళ్తున్నప్పుడు మార్గమధ్యంలో ప్రాణాలు విడవడం జరిగినది అదేవిధంగా రైతులు ఇష్టంగా పెంచుకునే పశువులకు వింత రోగాలైన లంబి వైరస్ సోకటం వలన వెటర్ని డాక్టర్ అందుబాటులో లేకపోవడం వల్ల లక్షలు విలువచేసేపశువులు ఎద్దులు మృత్యువాత పడటం జరిగినది అదేవిధంగా ప్రభుత్వ ఇంటర్ మరియు డిగ్రీ పాలిటెక్నిక్ కాలేజీలు లేకపోవడం మండల కేంద్రంలో బస్టాండ్ సెంటర్లులేకపోవడం మరియు చుట్టుపక్కల మరుగుదొడ్లు లేకపోవడం వల్ల మహిళలు మరియు ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్నారు.

ఆంధ్ర తెలంగాణ సరిహద్దు అయినటువంటి చింతలపాలెం మరియు జగ్గయ్యపేట వరకు ఎలాంటి బస్సు సదుపాయాలు కల్పించలేదని దానికోసం ఎక్కువ ఛార్జీలు వెచ్చించి ఆటోలో వెళ్లాల్సి వస్తుందని అదేవిధంగా విజ్ఞానాన్ని పెంపొందించుటకు గ్రంధాలయాలు లేకపోవడం మరియు శాశ్వత రెవిన్యూ భవనాలు లేకపోవడంఇలా చెప్పుకొంటూ పోతే మండల శాశ్వత రెవిన్యూ భవనాలు లేకపోవడం మండల కేంద్రంలో సమస్యలు చాలా ఉన్నాయి ప్రభుత్వాలు మారినాయి గత పాలకులు చేసిన తప్పులు చేయకుండా స్థానిక ఎమ్మెల్యే, మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి చొరవతో మండలంలో కావాల్సిన సదుపాయాలు ఏర్పాటు చేయాలని ప్రజల ఆవేదనను తెలియజేస్తున్నారు