బ్రాహ్మణ వెల్లoలతో
65వేల ఎకరాలకు సాగునీరు
మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
నల్గొండ, అక్షిత ప్రతినిధి :
రానున్న మూడు, నాలుగు నెలల్లో బ్రాహ్మణ వెల్లoల రిజర్వాయర్ను నీటితో నింపి 65 వేల ఎకరాలకు సాగునీరు ఇవ్వనున్నట్లు రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు.శుక్రవారం అయన నల్గొండ జిల్లా నార్కెట్ పల్లి మండలం తన సొంత గ్రామమైన బ్రాహ్మణ వెల్లేములలో ఉన్న ఏఎంఆర్ ప్రాజెక్టులు భాగమైన బ్రాహ్మణ వెల్లoల ప్రాజెక్టును నకిరేకల్ శాసన సభ్యులు వేముల వీరేశం, జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన, ఇంజనీరింగ్ అధికారులతో కలిసి తనిఖీ చేశారు.

అనంతరం మీడియా ప్రతినిధులతో మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వం బ్రాహ్మణ వెల్లoల పూర్తికి చర్యలు తీసుకోలేదని అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి బ్రాహ్మణ వెళ్లెముల ప్రాజెక్టు పూర్తి కి కృత నిశ్చయంతో ఉన్నారని, అందులో భాగంగానే డిసెంబర్ లోపు బ్రాహ్మణ వెల్లేముల ప్రాజెక్టును పూర్తి చేసి 65 వేల నుండి లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తామని తెలిపారు.మూసి ప్రక్షాళనతో నల్గొండ జిల్లాను పూర్తిగా శాశ్వతంగా ఫ్లోరైడ్ రహిత జిల్లాగా తీర్చిదిద్దుతామని ఇందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టుదలతో కృషి చేస్తున్నారని మంత్రి తెలిపారు. 40 వేల కోట్ల రూపాయలతో మూసి ప్రక్షాళనకు కంకణం కట్టుకున్నట్టున్నారని, ఆరు నెలల్లో మూసి సీవరేజ్ ప్లాంట్ ఏర్పాటు చేసి రానున్న మూడున్నర సంవత్సరాలలో మూసిని స్వచ్ఛమైన నదిగా తీర్చిదిద్దుతామని మంత్రి వెల్లడించారు.నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం జిల్లా కలెక్టర్ నరసింహ హరిచంద్ర ఇంజనీరింగ్ అధికారులు తదితరులు ఉన్నారు. అంతకు ముందు మంత్రి బ్రాహ్మణ వెళ్లెముల పంప్ హౌస్,రిజర్వాయర్ కట్టను పరిశీలించారు.