*మహాసభలకు ఖమ్మం ముస్తాబ్
మహాసభ ఏర్పాట్లను* పరిశీలించిన టీయూడబ్ల్యూజే నేతలు
ఖమ్మం, అక్షిత ప్రతినిధి :
ఈ నెల 19, 20 తేదీలలో రెండు రోజుల పాటు ఖమ్మం పట్టణంలోని ఉషా హరి కన్వెన్షన్ లో జరగనున్న తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) తృతీయ మహాసభ ఏర్పాట్లను సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నగునూరి శేఖర్, కె.విరాహత్ అలీలు శుక్రవారం నాడు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా సభా వేదికను, భోజన ఏర్పాట్లను, వసతి సౌకర్యాన్ని వారు పరిశీలించారు. మహాసభ ఏర్పాట్ల కోసం నియామకమైన ఆయా కమిటీలతో వారు సమావేశమై సమీక్షా జరిపారు.

అనంతరం యూనియన్ స్టిక్కర్లను ఆవిష్కరించి, మీడియా సమావేశాన్ని నిర్వహించి మహాసభ నిర్వహణ గురించి వివరించారు. ఈ సమావేశంలో యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కె.రాంనారాయణ, ఖమ్మం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వనం వెంకటేశ్వర్లు, ఏనుగు వెంకటేశ్వర్ రావు, నాయకులు రవీంద్ర శేషు, వేణు గోపాల్ రావు, నర్వనేని వెంకట్రావ్, ఎన్.వెంకట్ రావు, పాపారావు, మురహరి, ఆవుల శ్రీనివాస్, సైదులు, ఖదీర్ తదితరులు హాజరయ్యారు.