*చింతచిగురుతో వాత సమస్యలకు చెక్
హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :
చింత చిగురును ఆహారంతో పాటు తీసుకోవడం వల్ల *వాతం వల్ల వచ్చే సమస్యలు* తగ్గతాయి. అలాగే *మూల వ్యాధుల* నుండి కూడా ఉప శమనం లభిస్తుంది. అలాగే *కీళ్ల నొప్పులు* కూడా తగ్గుతాయి.
*గొంతు నొప్పి* సమస్యలు తగ్గుతాయి:
గొంతు నొప్పి సమస్యలకు కూడా చింత చిగురును ఉపయోగించవచ్ఛును. *చింత చిగురును నీటిలో మరిగించి.. గోరు వెచ్చగా ఉన్నప్పుడు నోట్లో వేసుకుని పుక్కిలించడం వల్ల గొంతు నొప్పి, గొంతు వాపు, గొంతులో మంట వంటి సమస్యలకు చెక్ పెట్టవచ్చు. అలాగే చింత చిగురు తినడం వల్ల కడుపులో నులి పురుగులు నశిసిస్తాయి*
*రోగ నిరోధక శక్తిని* పెంచుతుంది:
చింత చిగురును తినడం వల్ల *ఇమ్యూనిటీ లెవల్స్* కూడా పెరుగుతాయి. కాబట్టి ఇతర అనారోగ్య సమస్యలతో బాడీ పోరాడుతుంది.
*థైరాయిడ్ ను నియంత్రిస్తుంది*:
*థైరాయిడ్ సమస్యతో బాధ పడే వారు చింత చిగురును తినవచ్చు. చింత చిగురు తినడం వల్ల థైరాయిడ్ ను నియంత్రించవచ్చు. అలాగే రక్తాన్ని శుద్ధి చేస్తుంది*
*చెడు కొవ్వును తగ్గిస్తుంది*:
*చింత చిగురులో ఫినాల్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండటంతో.. చెడు కొవ్వును తగ్గించి.. మంచి కొవ్వును పెంచుతుంది. అలాగే ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి.. తిన్న ఆహారం బాగా జీర్ణమవుతుంది. దీంతో గ్యాస్, మల బద్ధకం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు ఉండవు.