కామాంధుని కఠినంగా శిక్షించాలి

*కామాంధుని కఠినంగా శిక్షించాలి

*- బాధిత కుటుంబానికి న్యాయం చేయాలి

రామన్నపేట మండల మహిళ అధ్యక్షురాలు గాదె శోభారాణి

నకిరేకల్, అక్షిత ప్రతినిధి :

ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన కూలీ దంపతులు చిన్నారితో పొట్ట కూటి కోసం పెద్దపెల్లి జిల్లాలో సుల్తానాబాద్ మండలం కాట్నపల్లిలోని ఒక రైస్ మిల్లులో పనిచేస్తున్నారు. ఆ మిల్లులో పనిచేసే బీహార్ కి చెందిన వినోద్ 28 సంవత్సరాలు అనే నిందితుడు తల్లి తండ్రి మధ్యలో పడుకున్న 6 సంవత్సరాల చిన్నారిని రాత్రి 11 గంటలకు ఎత్తుకెళ్లి అత్యాచారం చేసి చంపేసిన సంఘటన చాలా దురదృష్టకరమని మండల మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు గాదె శోభారాణి అన్నారు. తల్లిదండ్రులు పక్కనే ఉన్న ఆ బాలికను కాపాడుకోలేకపోవడం చాలా బాధాకరం అదేవిధంగా రాత్రిపూట నిరంతరం పోలీసుల పర్యవేక్షణ కూడా ఉండాలి. మద్యం,డ్రగ్స్ మత్తులో పడి ఇలాంటి అఘాయిత్యాలు చేస్తున్నారు. తొందరగా అతనికి శిక్ష పడాలి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా ఆ కుటుంబానికి న్యాయం జరిగే విధంగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఉక్కు పాదం మోపుతుందని మహిళా కాంగ్రెస్ తరపున వారి కుటుంబానికి సానుభూతి తెలియజేస్తున్నాము. నిందితుడిని కఠినంగా శిక్షించాలని బాదిత కుటుంబానికి సత్వర న్యాయం జరిగే విధంగా చూడాలని అన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking