ఏస్పీ సుడిగాలి పర్యటన

ఏస్పీ సుడిగాలి పర్యటన

ఉలిక్కిపడ్డ పోలీస్ యంత్రాంగం

వేములపల్లి, అక్షితన్యూస్:

శాంతి భద్రతలకు, సంఘ వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తే చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని నల్లగొండ జిల్లా నూతన ఎస్పి శరత్ చంద్ర పవార్ హెచ్చరించారు. శుక్రవారం మిర్యాలగూడ నియోజకవర్గ పరిధిలో , మాడ్గులపల్లి, వేములపల్లి, పోలీసు స్టేషన్ లను ఆకస్మిక తనిఖీ చేసి సిబ్బంది పని తీరు, వివరాలు, అడిగి తెలుసుకున్నారు. అనంతరం పోలీస్ స్టేషన్ల పరిసరాలు, పరిధిలోని స్థితిగతులు,పోలీస్ స్టేషన్ రికార్డుల వివరాలు,క్రైమ్ రేటు, శాంతి భద్రతలకు , సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు గురించి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసు స్టేషన్ కు వచ్చే ప్రజలతో గౌరవంగా వ్యవహరించాలని పోలీసులకు సూచించారు.రానున్న రోజుల్లో మరింత సమిష్టిగా శ్రమించాలని, గ్రామస్థాయిలో పరిస్థితులను లోతుగా అధ్యయనం చేసి సమస్యలు ఉత్పన్నం కాకుండా అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. గ్రామాలలో సమస్యలకు కారణమయ్యే వ్యక్తులను గుర్తించి ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. గ్రామాలు ప్రశాంతంగా కొనసాగేలా ప్రజలను సమాయత్తం చేయాలని పేర్కొన్నారు. కేటాయించిన విధులను సమర్థవంతంగా నిర్వర్తించి నేరాల నియంత్రణకు ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ డిఎస్పీ రాజశేఖర రాజు, ఎస్బి సిఐ రాఘవరావు, శాలిగౌరారం సిఐ శ్రీనివాస్ రెడ్డి, మిర్యాలగూడ రూరల్ సిఐ వీరబాబు, 2 టౌన్ సిఐ నాగార్జున,1 టౌన్ సిఐ సుధాకర్ ఎస్ఐ లు శోభన్ బాబు దాచేపల్లి విజయ్ కుమార్ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking