ఎంపీపీ ఎంపీటీసీల వీడ్కోలు సమావేశం

ఎంపీపీ ఎంపీటీసీల వీడ్కోలు సమావేశం

మంచి రాజకీయ నాయకునిగా ఎదగాలి

-జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి

చేర్యాల, జులై 4 అక్షిత ప్రతినిధి: సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలోని ఎంపీపీ ఎంపీటీసీల పదవి కాలం పూర్తి అయినందున గురువారం చేర్యాల పట్టణంలోని భద్రకాళి ఫంక్షన్ హాల్ లో చేర్యాల ఎంపీపీ ఉల్లంపల్లి కరుణాకర్ అధ్యక్షతన ఈ వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేయగా, ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి హాజరై మాట్లాడుతూ పార్టీ ఏదైనా ఎలక్షన్ సమయంలో పోటీపడి సర్పంచులు, ఎంపీటీసీలు బరిలో ఉండి ఖర్చు పెట్టుకుని పోరాడు గెలిచి ప్రజాసేవ తప్ప వారు సంపాదించింది ఏమీ లేదని అన్నారు.

సర్పంచుల ఎంపిటిసిల ఎంపీపీల బాధలు నాకు తెలుసు అని గుర్తు చేశారు. గ్రామాల్లో అభివృద్ధి కొరకు ఎమ్మెల్యే నిధులు మరియు ఎంపీ నిధుల ద్వారా వచ్చే ఆదాయంతో సర్పంచులు ఎంపీటీసీలు గ్రామాల అభివృద్ధి చేయాల్సి ఉంటుందని తెలిపారు. రాజకీయ ముడితో ప్రజాసేవకై ముందుకు వచ్చిన నాయకుడు, కష్టసుఖాల్లో పాలుపంచుకొని ప్రజలకు సేవలు అందిస్తూ మంచి రాజకీయ నాయకుడిగా ఎదగాలని సూచించారు. చేర్యాల ప్రాంతం పోరాటాల గడ్డ అని తెలంగాణ సాయుధ పోరాటంలో అనేక త్యాగాలు చేసిన చరిత్ర కలిగిన చేర్యాల గడ్డ అని అన్నారు. ఈ ఐదు సంవత్సరాలలో మీరు ఏ అభివృద్ధి చేసినారో, మిగిలిన అభివృద్ధి పనులను అన్ని గ్రామాలలో నేను చేస్తానని ప్రజలకు ఇచ్చిన మాట నిలుపుకుంటానని అన్నారు. ముఖ్యంగా నాకు అత్యధిక మెజార్టీ ఇచ్చినది చేర్యాల ప్రజలేనని గుర్తు చేశారు. చేర్యాల ప్రాంత అభివృద్ధికి నేను సహకరిస్తానని ప్రతి గ్రామంలో అభివృద్ధి చేస్తూ, వైద్య విద్యకు సహకరిస్తూ అనుకున్న పనులు చేస్తానని అన్నారు. అనంతరం ఎంపీపీ ఎంపీటీసీలకు ఘనంగా శాలువాలతో సన్మానించి ఫోటో మెంటులను అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఎండి మహబూబ్ అలీ, ఎంపీ ఓ, వైస్ ఎంపీపీ తాండ్ర నవీన్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ సుంకరి మల్లేశం గౌడ్, ఏఎంసి వైస్ చైర్మన్ పి వెంకట్ రెడ్డి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు జి బాలరాజు, మున్సిపల్ చైర్ పర్సన్ ఏ స్వరూప రాణి శ్రీధర్ రెడ్డి, వైస్ చైర్మన్ నిమ్మ రాజీవ్ రెడ్డి, కౌన్సిలర్లు, మాజీ సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు పి ఎల్లారెడ్డి, నాయకులు, అధికారులు, మరియు ఆయా గ్రామాల ఎంపీటీసీలు,మాజీ సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking