తోటి ఉద్యోగి మృతికి చింతిస్తూ ఆర్థిక సాయం అందజేత
నకిరేకల్ అక్షిత ప్రతినిధి
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం ఇంద్రపాలనగరం గ్రామానికి చెందిన
సౌత్ సెంట్రల్ రైల్వే , గుంటూరు డివిజన్ చిట్యాల సెక్షన్, రామన్నపేట స్టేషన్ యూనిట్ నెంబర్.07 లో గత తొమ్మిది సంవత్సరాలుగా ట్రాక్ మెయిన్టెనర్ గా విధులు నిర్వహిస్తున్నటువంటి కె .సురేష్ కొన్ని ఆరోగ్య కారణాల వల్ల హాస్పటల్లో చికిత్స పొందుతూ నిన్న సాయంత్రం మరణించడం జరిగింది. ఆయన మృతికి చింతిస్తూ మరణ వార్త వినగానే సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి సిహెచ్. శంకర్ రావు, మృతుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించి తక్షణం ఆర్థిక సహాయం క్రింద Rs.10,000/- రూపాయలను ప్రకటించి పంపించడం జరిగింది, అలాగే సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ నల్గొండ బ్రాంచ్ ఈ విషయం తెలుసుకొని మృతుడి కుటుంబాన్ని పరామర్శించి , ఆయన కుటుంబానికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి , తక్షణ సహాయం క్రింద.10,000/-రూపాయలను ప్రకటించి , మొత్తం 20,000/- రూపాయలని ఈ రోజు మృతుని కుటుంబానికి అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ నల్గొండ బ్రాంచ్ సెక్రటరీ కె. వెంకటేష్,
డివిజనల్ యూత్ కోఆర్డినేటర్ వై. నాగిరెడ్డి, అసిస్టెంట్ సెక్రటరీలు ఎం వి ఎస్. సాయిరాం, బి. నరసింహారావు, వర్కింగ్ ప్రెసిడెంట్లు స్వామి రావు, బిక్షపతి, బిఈసి. మేంబర్లు.వి.వెంకటేశం గోగు సత్యనారాయణ, హరి, రాజశేఖర్, సతీష్, శివ, కనకరాజు తదితరులు పాల్గొని సంతాపాన్ని తెలియజేశారు.