ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి

ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి

బత్తుల లక్ష్మారెడ్డి

మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
సమస్యలతో వచ్చే ప్రజల ఫిర్యాదులను సత్వరం పరిష్కరించాలని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి బిఎల్ఆర్ కోరారు. బుధవారం పట్టణంలోని తహసీల్దార్, జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ఎమ్మెల్యే బిఎల్ఆర్ సందర్శించి కార్యాలయం ఉద్యోగుల హాజరు రిజిస్టర్ పరిశీలిన చేసి వివరాలు తెలుసుకున్నారు.

అలాగే తహసీల్దార్ ఎన్.హరిబాబు, ఉద్యోగులతో మాట్లాడుతూ ప్రతి రోజు ఉదయం 9:30 గంటలకల్లా ప్రతిఒక్కరూ ఆఫీసులో ఉండాలని అలాగే భూమి సమస్యలతో వచ్చిన రైతుల ఫిర్యాదులను వెంటనే స్వీకరించి పరిష్కారం చేయాలన్నారు.

అలాగే రిజిస్ట్రేషన్ పనులు కూడా వెంటనే జరిగేలా ప్రజలకు సహకరించాలని కోరారు. అలాగే ప్రతీ సోమవారం జరిగే ప్రజావాణిలోని ఫిర్యాదులను తమ పరిధిలోని సమస్యలను గ్రహించి వెంటనే పరిష్కరించాలని అన్నారు. అనంతరం నూతనంగా నిర్మిస్తున్న సబ్ ట్రెజరీ కార్యాలయ భవనాన్ని పరిశీలించారు. కార్యాలయ వెనుక భాగం ప్రధాన మురుగు కాల్వను పరిశీలించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking