కొత్త చట్టాలపై లాయర్ల దీక్షకు ఎంపీజె సంఘీభావం

కొత్త చట్టాలపై లాయర్ల దీక్షకు ఎంపీజె సంఘీభావం

ఖమ్మం / అక్షిత బ్యూరో :

కేంద్ర ప్రభుత్వం జూలై 1వ తేదీ నుండి అమలులో వచ్చే విధంగా తీసుకొచ్చిన నూతన చట్టాలను నిరసిస్తూ ఖమ్మం కోర్టు ఎదుట లాయర్లు తలపెట్టిన నిరసన దీక్షకు బుధవారం జిల్లా ఎంపీజే నాయకులు సంఘీ భావం ప్రకటించారు.ఈ సందర్భంగా మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ (ఎంపీజే) జిల్లా అధ్యక్షుడు షేక్ ఖాసిం మాట్లాడుతూ కొత్త చట్టాల రూపకల్పన సందర్భంగా పార్టీలు ప్రజా సంఘాలు మేధావులు విద్యావంతులు లాయర్లను సంప్రదించకుండా చర్చించ కుండా ఏకపక్షంగా చట్టాల అమలుకు పూనుకోవడం వల్ల అమితమైన నష్టాలు జరుగుతాయని ఆందోళన వ్యక్తం చేశారు.ప్రజాస్వామిక దేశంలో ఏ చట్టమైన ప్రజాస్వామ్యక బద్ధంగా ప్రవేశపెట్టాలని అలా కాకుంటే ప్రజలకు తీవ్రమైన నష్టాలు జరుగుతాయని ఆరోపించారు.

కొత్త చట్టాల వల్ల కస్టడీని పొడిగించడం వలస చట్టం ను గుర్తుకు తెస్తుంది అన్నారు. సత్వర న్యాయం కోసం కోసమే ప్రవేశ పెట్టాము అనే ఈ చట్టాలతో న్యాయం కాకుండా అన్యాయమే జరిగే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.ఈ చట్టాలను తాత్కాలికంగా వాయిదా వేసి అందరితో చర్చించి ఏకాభిప్రాయాన్ని సాధించి అందరికీ ఆమోదయోగ్యంగా తీర్చిదిద్దిన అనంతరమే చట్టాల అమలుకు శ్రీకారం చుట్టాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఎంపీజే జిల్లా కార్యదర్శి సతీష్ చౌదరి సహాయ కార్యదర్శి గఫార్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking