*నిజంగా జర్నలిస్టులది దుర్భర జీవనమే*
*- జర్నలిస్టుల గురించి అసెంబ్లీలో ప్రస్తావించిన కూనమనేనికి కృతజ్ఞతలు*
*- గ్రామీణ జర్నలిస్టులకు ప్రత్యేక సంక్షేమ చట్టాలు తేవాలి*
*- రామన్నపేట ప్రెస్ క్లబ్ అధ్యక్షులు బూరుగు వెంకటేష్*
నకిరేకల్ అక్షిత ప్రతినిధి
గ్రామీణ ప్రాంతాల్లో జర్నలిస్టుగా పనిచేస్తున్న ప్రతి ఒక్క జర్నలిస్టు జీవితం నిజంగా దుర్బలమైనని,అసెంబ్లీలో కొత్తగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు ప్రస్తావించిన ప్రతి అక్షరం అక్షర సత్యాలని రామన్నపేట ప్రెస్ క్లబ్ అధ్యక్షులు బూరుగు వెంకటేష్, ప్రధాన కార్యదర్శి శివరాత్రి రమేష్ అన్నారు.ఆదివారం మండల కేంద్రంలోని విలేకరులతో మాట్లాడుతూ…ఉద్యోగాలు,ఉపాధి అవకాశాలు లేక దశాబ్దాల తరబడి వివిధ దిన పత్రికలలో పనిచేస్తున్న వారి జీవితాలు ఎదుగు,బొదుగు లేకుండా ఉన్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.ఆదుకుంటామని గత ప్రభుత్వాలు ఎన్నో హామీలు ఇచ్చి ఆరుబాటు ప్రచారాలు చేసుకొని విస్మరించాయని ఆయన విమర్శించారు.నివాసం ఉండడానికి సరైన ఇల్లు లేక ఎలాంటి వస్తువులు లేని గృహాలలో జీవనం సాగిస్తున్నారని,అనేకమంది అద్దె ఇంట్లో ఉన్నారన్నారు.ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే ఇక వారి పరిస్థితి ఆగమాగమేనని,వారి కుటుంబాలు రోడ్డు మీద పడాల్సిందేనని వారు తెలిపారు.ఇప్పటికైనా కొత్తగా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం విలేకరుల పట్ల సానుభూతి వ్యవహరించి ప్రత్యేక సంక్షేమ పథకాలు తీసుక రావాలని వారు కోరారు.విలేకరుల జీవనస్థితిగతులను,వారు ఎదుర్కొంటున్న బాధలను,కష్టాలను అసెంబ్లీలో ప్రస్తావించిన ఎమ్మెల్యే కూనమనేనికి వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కనతాల శశిధర్ రెడ్డి,ఎండి గౌస్,కుకుడాల మహేందర్ రెడ్డి,ఎండి తఖియోద్దిన్,జినుకల శ్రీనివాస్,లవణం ఉపేందర్,తెలుసూరి మల్లేశం,హర్షత్,చేన్నకేశ్వర్, కొండ మల్లేష్,మద్దగళ్ళ నర్సింహా, ముత్యాల రమేష్,బత్తుల గణేష్ తదితరులు పాల్గొన్నారు.