ఈ రోడ్లు బ్లాక్ ..

నంగునూర్ మండలంలో ఈ రోడ్లు బ్లాక్ ..
నంగునూర్, అక్షిత ప్రతినిధి:
వాగులు వంకలు, పొంగిపొర్లుతున్నాయి.
ఖాతా వాగు రోడ్డుపై పొంగుతున్నది కావున జాలపల్లి నుండి ఖాతా, మరియు ఖాతా నుండి జాలపల్లి వెళ్లే రోడ్డును స్టాపర్స్ తో బ్లాక్ చేయడం జరిగింది. మండల ప్రజలకు మరియు జాలపల్లి, ఖాతా గ్రామస్తులు మరియు వాహనదారులు ఎవరు కూడా ఆ రోడ్లో వెళ్ళవద్దని సూచించారు.
దర్గపల్లి నుండి సికిందలాపూర్ వాగు రోడ్డు మీద నుండి ప్రవహిస్తున్నందున ఆ రోడ్డు కూడా స్టాపర్స్ తో బ్లాక్ చేయడం జరిగింది. దర్గపల్లి సికిందలాపూర్ గ్రామస్తులు ప్రజలు వాహనదారులు అటువైపు ప్రయాణించవద్దని రూరల్ సీఐ శ్రీను ఒక ప్రకటనలో తెలిపారు. రాబోవు 24 గంటలు భారీ వర్షాలు ఉన్నందున నంగునూర్ మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking