వర్షాలతో అప్రమత్తంగా ఉండాలి

భారీ వర్ష సూచన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

ప్రజలకు అందుబాటులో ఉండాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసిన జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి

కరీంనగర్,అక్షిత బ్యూరో :

కరీంనగర్ కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు.భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ పమేలా సత్పతి ఒక ప్రకటనలో తెలిపారు భారీ నుండి అతి భారీ వర్షాలకు సంబంధించిన బాధితులు కంట్రోల్ రూమ్ లోని టోల్ ఫ్రీ నెంబర్ +91 878 299 7247 తో బాటు వాట్సాప్ నెంబర్ ను
+91 81251 84683ను సంప్రదించవచ్చునని కలెక్టర్ పేర్కొన్నారు. బాధితులకు అండగా ఉండేందుకు కంట్రోల్ రూమ్ లో సిబ్బంది 24గంటల పాటు అందుబాటులో ఉంటారని కలెక్టర్ అట్టి ప్రకటన లో వెల్లడించారు

Leave A Reply

Your email address will not be published.

Breaking