ఘనంగా కార్తికేయ జన్మదిన వేడుకలు.
కూకట్ పల్లి, అక్షిత ప్రతినిధి:
ఆనంద్ రావు మనవడు కార్తికేయ జన్మదిన వేడుకలు ఆల్విన్ కాలనీలోని రాజేశ్వరి వృద్ధాశ్రమంలో ఘనంగా నిర్వహించారు. ఆదివారం కార్తికేయ జన్మదిన సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన జనంపల్లి పురేందర్ రెడ్డి రాజేశ్వరి వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పురేందర్ రెడ్డి మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు చేయుట చాలా మంచిదని వారి తల్లిదండ్రులకు మరియు ఆనందరావు కి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఆశ్రమం ఇంచార్జ్ రాజేశ్వరి,ఆనందరావు, శ్రీదేవి,సతీష్, శ్రీధర్,నర్సింగ్ రావు, సూర్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.