అందరితో కలిసి అందరి అభివృద్ధే నా లక్ష్యం

అందరితో కలిసి అందరి అభివృద్ధే నా లక్ష్యం

‌‌-ఎమ్మెల్సీ ఆమేర్ అలీఖాన్

ఖమ్మం/అక్షిత బ్యూరో :

తెలంగాణ ఉద్యమం సందర్భంగా అందరూ పెట్టుకున్న ఆకాంక్షలకు అనుగుణంగా అందరితో కలిసి అందరి అభివృద్ధిని సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నానని ఎమ్మెల్సీ సీయాసత్ చీఫ్ ఎడిటర్ ఎమ్మెల్సీ ఆమేర్ అలీ ఖాన్ అన్నారు. డెమోక్రాటిక్ మైనార్టీస్ ఫ్రెంట్ ఆధ్వర్యంలో ఆదివారం టీఎన్జీఓ ఫంక్షన్ హాల్లో తొలిసారిగా ఖమ్మం విచ్చేసిన ఆమేర్ అలీ ఖాన్ ని ఘనంగా సన్మానించారు. అనంతరం ఖమ్మం ఉమ్మడి జిల్లా టిజెఎస్ కన్వీనర్ గోపగాని శంకర్ రావు అధ్యక్షతన జరిగిన సన్మానోత్సవ సభా కార్యక్రమంలో ఆమేర్ అలీ ఖాన్ ప్రసంగించారు. ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావాలనే తన ధ్యేయమని తెలంగాణాలో ప్రత్యేకంగా ఎస్సీ ఎస్టీల కన్నా వెనుకబడ్డ ముస్లీంల అభివృద్ధి కోసం తగిన ప్రణాళికలతో అభివృద్ధి బాటలు వేయడం తన ధ్యేయంగా పెట్టుకున్నానని అన్నారు. తెలంగాణ ఉద్యమం సందర్భంగా అన్ని వర్గాల సాముహిక అభ్యున్నతి లక్ష్యంగా అందరు కలిసి కట్టుగా పోరాడిన అనంతర కాలంలో కొందరికే లబ్ధి జరిగిందని అన్నారు.

ముఖ్యంగా నీళ్లు విద్యుత్ వంటి మౌళిక సమస్యల పరిష్కారం ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు తరువాత తీరిపోతాయని భావించినా ఏదీ సఫలీకృతం కాలేదని అన్నారు. తనకు ఇంకా ఆరేళ్లపాటు ఎమ్మెల్సీ పదవి కాలం ఉంటుందని తన హయాంలో సవత్సరానికి లక్ష మందికి అభివృద్ధి చేయాలని కంకణం కట్టుకున్నానని అన్నారు.వచ్చే నాలుగేళ్లలో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా ఎదుగుతుందని ఈ క్రమంలోనే అందరితో అందరి అభివృద్ధి లక్ష్యంగా తాను ఎస్సీ ఎస్టీ బీసీలతో కలసి మైనార్టీల అభివృద్ధికి అలాగే ఎస్సీ ఎస్టీ బీసీల అభివృద్ధికి ప్రణాళిక బద్దంగా కృషి చేస్తానని అన్నారు. తెలంగాణ అంటేనే దేశంలో గంగా జమున తెహెజీబ్ కి ప్రతీక వంటిదని ఇక్కడ మత సామరశ్యం వెల్లివిరుస్తుందని హిందూ ముస్లీలతో పాటు సిక్కు ఇసాయి కూడా భాయీ భాయియేనని అన్నారు. ఇది కేవలం నినాదంగా మిగిలిపోకుండా ఆచరణలో తీసుకురావడమే తన ఆకాంక్ష అని పేర్కొన్నారు. తొలుత తెలంగాణ అమరవీరులకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తండ్రి మృతికి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది అంబటి శ్రీనివాస్ టీజేఏసీ జిల్లా మాజీ చైర్మన్ కూరపాటి రంగరాజు టీజేఎస్ విభజన విభాగం జిల్లా అధ్యక్షులు సయ్యద్ సలీం తొలిమలిదశ ఉద్యమ కారులు అర్వపల్లి విద్యాసాగర్ ఉద్యమకారుల ఫోరం నాయకులు డాక్టర్ కేవి.కృష్ణారావు ఎంపీజే జిల్లా అధ్యక్షుడు షేక్ ఖాసీం డెమోక్రాటిక్ మైనార్టీస్ ఫ్రంట్ నాయకులు సయ్యద్ అజీమ్ షేక్ ఖాజా మీయా ఎండీ షఫీ ఖాన్ ఉమర్ అలీబాబా బట్టు రాజేందర్ సర్దార్ హుస్సేన్ బెల్లంకొండ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking