*విరాహత్ అలీకి మ.ర.సం* *సత్కారం*
సిద్దిపేట, అక్షిత ప్రతినిధి :
మంజీరా రచయితల సంఘం వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన విరాహత్ అలీ, టీయుడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నికైనందున ఇవ్వాళ సిద్దిపేటలోని విపంచి ఆడిటోరియంలో జరిగిన మ.ర.సం 38వ వార్షికోత్సవ సభలో ఆయనను ఘనంగా సత్కరించి ఆత్మీయత పంచుకున్నారు.
నిర్భంధాలను సైతం లెక్కజేయకుండా వర్కింగ్ జర్నలిస్టుల ఉద్యమంతో పాటు మంజీరా రచయితల సంఘం కార్యకలాపాలను మెతుకుసీమలో విస్తరింపజేసేందుకు ప్రజా పాత్రికేయుడిగా విరాహత్ అలీ పోషించిన పాత్ర అభినందనీయమని పలువురు కొనియాడారు.
మ.ర.సం అధ్యక్షుడు కె.రంగాచారీ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆంధ్రజ్యోతి సంపాదకులు కె. శ్రీనివాస్, ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ కాసీం, మ.ర.సం వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ నందిని సిధారెడ్డి, వ్యవస్థాపక సభ్యులు, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, దేవిప్రసాద్, కె. అంజయ్య, తోట అశోక్, అలాజీపూర్ శ్రీనివాస్ లతో పాటు సిద్దిపేట జర్నలిస్టులు పాల్గొన్నారు.