మంత్రి ఉత్తమ్ తండ్రి పురుషోత్తం రెడ్డి పార్థివదేహానికి పుష్పాంజలి ఘటించిన సీఎం రేవంత్ రెడ్డి*

*మంత్రి ఉత్తమ్ తండ్రి పురుషోత్తం రెడ్డి పార్థివదేహానికి పుష్పాంజలి ఘటించిన సీఎం రేవంత్ రెడ్డి*

హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :

జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని, వారి కుటుంబ సభ్యులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ తండ్రి పురుషోత్తం రెడ్డి పార్థివదేహానికి సీఎం రేవంత్ రెడ్డి పుష్పాంజలి ఘటించారు.వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థించారు. వారి కుటుంబ సభ్యులకు సీఎం ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కాగా, గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న పురుషోత్తంరెడ్డి ఆదివారం ఉదయం తుది శ్వాస విడిచారు. పురుషోత్తం రెడ్డి మృతిపట్ల మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, అన్ని పార్టీల ఎమ్మెల్యేలు, నాయకులు సంతాపం ప్రకటించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking