కొండా సురేఖకు బీసీ సమాజమంతా అండ

కొండా సురేఖకు బీసీ సమాజమంతా అండ

బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి లింగంగౌడ్

హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :

మంత్రి కొండా సురేఖ తాను అన్న మాటలను, జరిగిన పొరపాటును తెలుసుకొని ఆ మాటలను ఉపసంహరించుకొని, విచారం వ్యక్తం చేసిన తర్వాత కూడా చర్చ కొనసాగించడం అనవసరమని, అయినా కొంతమంది సినిమా పరిశ్రమకు చెందిన వారు ఇదే విషయాన్ని రాద్దాంతం చేస్తు అమెపై ఎదురు దాడికి దిగడం సరికాదని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగంగౌడ్ అన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొండా సురేఖ వ్యాఖ్యలను వెనక్కి తీసకోవాలని అక్కినేని నాగార్జున ఫ్యామిలీ కోరిన వెంటనే మంత్రి  స్పందించి తాను చేసిన వ్యాఖ్యలను ఉపసంరించుకుంటున్నట్లు పత్రికా, మీడియా ఎదురుగానే చెప్పారని గుర్తు చేశారు. బీసీల బిడ్డ మహిళా మంత్రి కొండా సురేఖను ఏదో ఒక ప్రభుత్వ కార్యక్రమంలో మెదక్ పార్లమెంట్ సభ్యుడు నూలు పోగుతో చేసిన కండువా కప్పితే సోషల్ మీడియాలో అత్యంత హీనంగా ట్రోల్ చేసినప్పుడు ఒక్కడు స్పందించని, మాట్లాడని సినీ లోకం అగ్రకుల హీరోకు మద్దతుగా మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. ఒక బహుజన మంత్రి కొండా సురేఖ ఏడుపు సినీ పరిశ్రమకు వినిపించలేదా అని ప్రశ్నిస్తున్నాo.

Leave A Reply

Your email address will not be published.

Breaking