దీప కాంతుల దీపావళి

మిర్యాలగూడలో వైభవంగా దీపావళి వేడుకలు
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :

మిర్యాలగూడ పట్టణం, మండలంలోని వివిధ వార్డుల్లో, వాడల్లో దీపాల పండుగ దీపావళిని గురువారం వైభవంగా, ఘనంగా నిర్వహించారు.

సాయంత్రం ఇళ్లను రంగు రంగుల విద్యుత్ దీపాలు, ఇంటి ముందు ప్రమిదలు వెలిగించి పూజలు చేశారు.

దేవాలయాల్లో 7భక్తులు, పిల్లలు, మహిళలు పిల్లలు పూజల్లో పాల్గొన్నారు. దీప కాంతుల మధ్య పిల్లలు, పెద్దలు భారీగా బాణసంచా కాల్చారు. మిఠాయిలు పంచారు. బాణ సంచా భారీగా కాల్చడంతో వాటి చప్పుళ్ళతో దద్దరిల్లింది. రాత్రి 11 వరకు బాణసంచా కాల్చారు. ఒకరికొకరు పండగ శుభకాంక్షలు తెలిపారు.

అదేవిధంగా ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి బిఎల్ఆర్, మాజీ ఎమ్మెల్యేలు జూలకంటి రంగారెడ్డి, నల్లమోతు భాస్కర్ రావు, తిప్పన విజయసింహారెడ్డి, రేపాల శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్, శంకర్ నాయక్, మున్సిపల్ మాజి చైర్మన్ నాగలక్ష్మి భార్గవ్, మెరుగు రోశయ్యలు శుభాకాంక్షలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking