ఇందిరకు ఘన నివాళులు

ఇందిర ఆశయ సాధనకు కృషి 

మిర్యాలగూడ అక్టోబర్ 31 అక్షిత ప్రతినిధి :

మొదటి భారత మహిళా ప్రధాని కీ. శే ఇందిరాగాంధీ 40వ వర్ధంతి గురువారం సందర్భంగా మిర్యాలగూడ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం రాజీవ్ భవన్ లో శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి బిఎల్ఆర్, డిసిసి అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్ ఆధ్వర్యంలో ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది.అనంతరం పట్టణంలోని ఇందిరా గాంధీ  విగ్రహానికి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత దేశపు తొలి ఏకైక మహిళా ప్రధాని ఇందిరా గాంధీ రాజకీయ జీవితం ఎంతో మందిని ప్రభావితం చేసిందన్నారు.ఆమె కుటుంబం అంతా దేశం కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన గొప్ప నాయకులన్నారు.వారి పరిపాలన చూసి ఆమెను అందరూ ఐరన్ లేడీ అని పిలుచుకునే వారన్నారు.నేటి మహిళలకు వారి జీవితం ఎంతో ఆదర్శమని అన్నారు. మిర్యాలగూడ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘన నివాళులర్పించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు చిరుమర్రి కృష్ణయ్య, మహబూబ్ అలీ, పి.రామలింగయ్య, పొదిల శ్రీనివాస్, ఎంఎ. సలీం, బెజ్జం సాయి, కాంఠారెడ్డి, బసవయ్య గౌడ్, చాంద్ పాషా, రవీందర్ రెడ్డి, కౌన్సిలర్ గంధం రామకృష్ణ, జలంధర్ రెడ్డి, చిలుకూరు బాలు, మాజి మున్సిపల్ చైర్మన్ మెరుగు రోశయ్య, బిఎల్ఆర్ బ్రదర్స్ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking