వాలిబాల్ రాష్ట్ర టోర్నమెంట్ కు ఎంపికైన జస్వంత్ ను సన్మానించిన జనయేత్రీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ మునీర్
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
జనయేత్రి కుటుంబ సభ్యులు రాజబోయిన శ్రీనివాస్, రమాదేవిల కుమారుడు జశ్వంత్ సూర్యాపేట జిల్లా వాలీబాల్ టీంకి అండర్ -14 విభాగంలో నల్గొండ మేకల అభినవ్ స్టేడియంలో యాదాద్రి భువనగిరి నల్గొండ సూర్యాపేట ఉమ్మడి జిల్లా టోర్నమెంట్ కి ఎంపికైన సందర్భంగా జనయేత్రి ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ మునీర్ అహ్మద్ షరీఫ్ బుధవారం ఫ్రెండ్స్ ఫస్ట్ ఎయిడ్ సెంటర్ లో ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జనయేత్రి కుటుంబ సభ్యులు రమాదేవి కుమారుడు జస్వంత్ ఉన్నత శిఖరాలకు చేరుకోవాలన్నారు.
వాలీబాల్ క్రీడలో నైపుణ్యాన్ని చూపుతూ రాష్ట్ర స్థాయికి సెలెక్ట్ కావటం సంతోషకరమని ఇంకా ఎన్నో అవార్డులు, మెడల్స్ సాధించాలని, తల్లిదండ్రులకు, పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని కోరారు.