నన్నూరికి ఘన సత్కారం

నన్నూరికి ఘన సత్కారం

టిటిడి సభ్యులుగా ఎంపిక పట్ల హర్షం
హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :

తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యులుగా ఎన్నికైన నన్నూరి నర్సిరెడ్డిని తెలుగుదేశం పార్టీ నాయకులు నెల్లూరి దుర్గాప్రసాద్, జడ రాములు యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా నెల్లూరి దుర్గాప్రసాద్ మాట్లాడుతూ పార్టీకి చేసిన కృషికి చంద్రబాబు నాయుడు కార్యకర్తకు ఇచ్చిన గుర్తింపు అని తెలుగుదేశం పార్టీలో కష్టపడి పనిచేసిన వారికి గుర్తింపు ఉంటుందని నన్నూరి నర్సిరెడ్డికి ఇచ్చిన పదవి నిదర్శనమని తెలిపారు. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ నియోజకవర్గ నాయకులు కాసుల సత్యం మాన్య నాయక్, పోగుల సైదులు, షేక్ రసూల్, ఎస్.కె జానీ, కట్టా అనంతరెడ్డి, జడ మల్లేష్, వలపట్ల రమేష్, కోటేశ్వరరావు, మహేష్ చౌదరి, శ్రీరామ్, నాగయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking