మెరుగైన సేవలందించే లక్ష్యం
విద్యుత్ సమస్యలకు చెక్
శ్రీనివాస సుధీర్ కుమార్
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
విద్యుత్ వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు అధికారులు, ఉద్యోగులు పని చేస్తున్నారని మిర్యాలగూడ విద్యుత్ శాఖ డివిజనల్ ఇంజనీర్ శ్రీనివాస సుధీర్ కుమార్ తెలిపారు. ఆదివారం విద్యుత్ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా స్థానిక డివిజన్ కార్యాలయంలో సమస్యల పరిష్కార వేదికలో ఆయన మాట్లాడుతూ వినియోగదారుల దీర్ఘ కాలిక సమస్యలు పరిష్కరించేందుకు గ్రీవెన్స్ రెడ్రెస్సల్ ఫోరంకు సంప్రదించాలని, అంబుఢ్ స్మెన్ ద్వారా కూడ సత్వర సమస్యలు పరిష్కరించేందుకు అవకాశం ఉందని ఆయన అన్నారు. దిగువ స్థాయిలో సమస్యలు పరిష్కారం కాకుంటే తన స్థాయిలో పరిష్కరిస్తాన్నారు. వినియోగదారులు విద్యుత్తు పొదుపు అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యుత్ సామాగ్రిని బట్టి విద్యుత్ వినియోగం ఉంటుందని నాణ్యమైన విద్యుత్ పరికరాలు వినియోగించాలని కోరారు. పరిష్కార వేదికకు సుమారు 5 ఫిర్యాదులు రాగా సంబంధిత ఎఇఇలకు అందజేసి సత్వరం పరిష్కరించేందుకు కృషి చేయాలని కోరారు.
వేదికలో మురళి, రాజు, చారీల ఫిర్యాదులను పరిశీలించి పరిష్కరిస్తామని విద్యుత్ డిఇ పేర్కొన్నారు. వేదికలో అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ కోడిరెక్క విజయ్ కుమార్, టూ టౌన్ ఏఈ రవీందర్ రెడ్డి, రూరల్ ఎఇ అమర్ సింగ్, దామరచర్ల ఎఇ హాబీబ్, థ్రిపురారం, అడవిదేవులపల్లి, వేములపల్లి ఎఇలు బాలునాయక్, శ్రీనునాయక్, నాగరాజు, ఎఎఓ శ్రీనివాసరావు, జెఎఓ తోట వెంకటేశ్వర్లు, విజయ్, వెంకటేశం, ఉపేందర్, సబ్ ఇంజనీర్లు కృష్ణారెడ్డి, సీతారామారావు, నవీన్, లైన్ ఇన్స్పెక్టర్లు నరేందర్ రెడ్డి, యతిరాజు, రాంచంద్రణాయక్, రాజేశ్వర్ రావులు పాల్గొన్నారు.