నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు

నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు

మాడ్గులపల్లి, అక్షిత న్యూస్ :

మండలంలోని తోపుచర్ల గ్రామానికి చెందిన మంగ జయమ్మ-సైదులు ముదిరాజ్ దంపతుల ప్రథమ పుత్రుడు మంగ మహేష్ ముదిరాజ్ వివాహం వేములపల్లి మండలం శెట్టిపాలెం గ్రామానికి చెందిన బంటు లలిత పాపయ్య ముదిరాజ్ ల ఏకైక పుత్రిక అనితతో ఆదివారం మిర్యాలగూడ పట్టణం నందిపాడులోని టిఎన్ఆర్ గార్డెన్స్ లో బంధుమిత్రులు ఇరువురి కుటుంబ సభ్యుల నడుమ అంగరంగ వైభవంగా జరిగింది. మహేష్ -అనిత వివాహ వేడుకకు మిర్యాలగూడ మాజీ శాసన సభ్యులు, భారత రాష్ట్ర సమితి నియోజకవర్గ ఇంచార్జి నల్లమోతు భాస్కర్ రావు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.ఈకార్యక్రమంలో రైతుబంధు సమితి మాజీ జిల్లా అధ్యక్షుడు చింతరెడ్డి శ్రీనివాస రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పాలుట్ల బాబయ్య, మాజీ పిఎసిఎస్ చైర్మన్ జేరిపోతుల రాములు గౌడ్, దామరచర్ల మాజీ జెడ్పిటిసి ఆంగోతు లలిత- హాతిరాం నాయక్,మాజీ ఎంపీటీసీలు మజ్జిగపు సుధాకర్ రెడ్డి, కత్తి కనకారెడ్డి, నాయకులు రమావత్ వినోద్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking