జంగా వివాహా వేడుకకు సీఎం రేవంత్

*వివాహ వేడుకకు హాజరైన ముఖ్యమంత్రి, మంత్రులు అదికారులు*

వరంగల్, అక్షిత బ్యూరో:

ఆదివారం హన్మకొండ జిల్లా మడికొండలోని సత్యసాయి గార్డెన్స్ లో జరిగిన తెలంగాణ స్టేట్ కో ఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్ ఛైర్మన్ జంగా రాఘవరెడ్డి, సుజాత దంపతుల కూతురి వివాహ వేడుకలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి హాజరై, నూతన దంపతులను ఆశీర్వదించిన రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖామాత్యులు కొండా సురేఖ పట్టు వస్త్రాలు బహూకరించారు.ఈ వివాహ వేడుకలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
*ముఖ్యమంత్రిని మర్యాద పూర్వకంగా కలిసిన సిపి*


వివాహ కార్యక్రమం హాజరైందుకు మడికొండలో హెలిప్యాడ్ కు చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలుసుకొని పుష్పాగుచ్చాలను అందజేసిన వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా

Leave A Reply

Your email address will not be published.

Breaking