సకల సదుపాయాలతో ఇంటి గ్రేటెడ్ స్కూల్

*యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి శంకుస్థాపన*

*శంకుస్థాపనకు వచ్చిన ముగ్గురు రాష్ట్ర మంత్రులు*

భట్టి ,ఉత్తం, కోమటిరెడ్డి*

గరిడేపల్లి, అక్షిత ప్రతినిధి :

సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం గడ్డిపల్లి గ్రామంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించడం జరిగింది. ఆదివారం రోజు జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర రోడ్లు భవనాల, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి నలమాధ ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరైనారు. గరిడేపల్లి మండలం గడ్డిపల్లి రెవెన్యూ శివారులో ఉన్న 57 సర్వేనెంబర్ గల ప్రభుత్వ భూమిలో 25 ఎకరాల 21 గుంటల భూమిని ఈ స్కూల్ నిర్మాణానికి కేటాయించడం జరిగింది.

దాదాపు 200 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించే ఈ పాఠశాలలో 4వ తరగతి నుండి 12వ తరగతి (ఇంటర్) వరకు ఇంగ్లీష్ మీడియంలో విద్యనభ్యసించే విధంగా సుమారు 2500 మంది విద్యార్థులకు సరిపోవు విధంగా పాఠశాల తరగతి గదులు, హాస్టల్ వసతి గదులు, క్రీడా మైదాన ప్రాంగణం మొదలైన సౌకర్యాలతో ప్రపంచ స్థాయిలోనే మొట్టమొదటి స్కూల్ గా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ని నిర్మించబోతున్నట్లు తెలియపరిచారు.

ఈ సందర్భంగా హుజూర్నగర్ ఎమ్మెల్యే, రాష్ట్ర భారీ నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి మాట్లాడుతూ, ఊరికి చివరలో పచ్చని పంట పైర్ల మధ్యన చెరువు పక్కన గుట్టాల ప్రదేశంలో నిర్మించబోయే ఈ పాఠశాల ఆహ్లాదకరంగా ఉంటుందని అన్నారు. అదేవిధంగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, బట్టి విక్రమార్కలతో తన సొంత నియోజకవర్గం లోని గరిడేపల్లి మండలానికి స్కూల్ శంకుస్థాపన కొరకు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. అదేవిధంగా హుజూర్నగర్ నియోజకవర్గంలో తనను అధికసార్లు గెలిపించిన ప్రజలకు రుణపడి ఉన్నానని తెలియపరిచారు. రాష్ట్రంలో ఈసారి సమృద్ధిగా వరి ధాన్యం 150 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చే అవకాశం ఉందని ఈ ధాన్యాన్ని పండించిన రైతులకు చేతులెత్తి మొక్కుతున్నట్లు తెలియపరిచారు. ఈ కార్యక్రమంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ, ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రస్తుత సూర్యాపేట జిల్లాలో గరిడేపల్లి మండలం గడ్డిపల్లి గ్రామానికి ఓ ప్రత్యేకత ఉందని అన్నారు. అదేవిధంగా ఈ యొక్క యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా ఈ గడ్డిపల్లి గ్రామంలో నిర్మించబోతున్నందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. స్కూల్ నిర్మాణం పూర్తయ్య లోపల గడ్డిపల్లి ప్రధాన కూడలి నుండి స్కూల్ వరకు రోడ్డు నిర్మించే బాధ్యత తనదేనని అన్నారు. చిట్ట చివరిగా మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ, తాను ఉప ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొట్టమొదటిసారిగా శంకుస్థాపన చేసే ఈ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ప్రదేశం ఊటీ లో ఉన్న విధంగా ఉందన్నారు. సుమారు 200 కోట్ల వ్యయంతో నిర్మాణం చేపట్టబోయే స్కూలు లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ జనరల్ అనే తారతమ్యాలు లేకుండా ఆంగ్ల భాషలో ప్రపంచ స్థాయిలో విద్యను అభ్యసించే లాగా చర్యలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామస్థాయి పార్టీ కార్యకర్తలు ముఖ్య నాయకులు, విద్యార్థినీ, విద్యార్థులు, రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking