దేశానికే
చుక్కానిలా
తెలంగాణ
వచ్చే నాలుగేళ్లలో
మరింత ప్రగతి
ఒకే రోజు విద్యుత్, వైద్యం
సాగు నీటి ఆవిష్కరణలు
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు
నల్గొండ, అక్షిత బ్యూరో :
రాష్ట్ర ప్రగతికి ప్రణాళికలు సిద్ధం చేసుకుని, మరోవైపు అప్పులు తీర్చుకుంటూ ముందుకు పోతున్నామని.. మొదటి ఆరు నెలలు పార్లమెంటు ఎన్నికల కోడ్ కిందికి పోగా మిగిలిన ఆరు నెలల్లోనే అద్భుతాలు సృష్టించామని.. మిగిలిన 4 ఏళ్లలో తెలంగాణను యావత్ భారతదేశానికి ఒక మోడల్ గా చేసి చూపిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. శనివారం ఆయన నల్లగొండలో భారీ బహిరంగ సభలో ప్రసంగించారు.
పదేళ్లు పాలించిన టిఆర్ఎస్ నేతలు నల్లగొండ జిల్లాకు తీవ్ర అన్యాయం చేశారని విమర్శించారు. నల్లగొండ జిల్లాకు సంబంధించి ఏ ఒక్క ప్రాజెక్టును పదేళ్లలో పూర్తి చేయలేక పోయారని అన్నారు. శ్రీశైలం సొరంగ మార్గం 10 కిలోమీటర్లు తవ్వాల్సి ఉండగా ఏడాదికి ఒక్క కిలోమీటర్ తోవ్విన అది పూర్తయ్యేది.. కృష్ణా జలాలు గలగల పారేవి కానీ టిఆర్ఎస్ నేతలు పట్టించుకోలేదని అన్నారు. ఒక ఎస్ఎల్ బి సి సొరంగమే కాదు, బ్రాహ్మణ వెల్లెంలా, డిండి, నక్కలగండి అన్ని పక్కకు పడేశారని అన్నారు.
యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టు ప్రారంభించినప్పుడు జిల్లా ప్రజలకు టిఆర్ఎస్ నేతలు సినిమా చూపించారని విమర్శించారు. 20 22లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కాలుష్యం పేరుతో అభ్యంతరం చెబితే టిఆర్ఎస్ నేతలు 20 22 నుంచి 2024 వరకు యాదాద్రి ప్రాజెక్టు విషయాన్ని గాలికి వదిలేసారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే యాదాద్రి థర్మల్ విద్యుత్ ప్రాజెక్టుపై దృష్టి పెట్టి వెంటనే ప్రజాభిప్రాయ సేకరణ జరిపించి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి పవర్ ప్రాజెక్టు ప్రారంభానికి అనుమతులు సాధించి.. ఏడాది కాలంలోనే విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించామని తెలిపారు. యాదాద్రి పవర్ ప్రాజెక్టు పూర్తికి ప్రతినెల సమీక్ష చేసి ఈరోజు విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించి గ్రిడ్డుకు అనుసంధానం చేసాము అన్నారు.
శ్రీశైలం సొరంగ మార్గాన్ని సంపూర్ణంగా పూర్తి చేస్తాం, చేసిన పనులకు ప్రతినెల బిల్లులు చెల్లించి నల్లగొండ జిల్లాకు కృష్ణా జలాలు పారిస్తామని తెలిపారు.
ఫిలాయిపల్లి, ధర్మారెడ్డి కాల్వ పనులకు అనుమతులు ఇవ్వాలని స్థానిక ఎమ్మెల్యేలు కోరారు.. ఆ పనులకు ఆర్థిక అనుమతులు ఇచ్చాకే ఇక్కడికి వచ్చామని డిప్యూటీ సీఎం తెలిపారు.
పేద బిడ్డల చదువుల కోసం యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్స్ ప్రారంభిస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వం సంక్షేమ వసతి గృహాలకు ఏడాదికి 70 కోట్లు ఖర్చు చేస్తే.. మా ప్రభుత్వం ఈ ఒక్క ఏడాదే యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్స్ నిర్మాణానికి ఐదువేల కోట్లు కేటాయించామని, ప్రతి నియోజకవర్గంలో ఒక ఇంటర్నేషనల్ స్థాయి పాఠశాలను ప్రారంభిస్తామని తెలిపారు.
ఓవైపు విద్య, మరోవైపు వైద్యం, విద్యుత్తు, ఉద్యోగాలు.. సంక్షేమం అన్ని రంగాల అభివృద్ధికి ప్రణాళికబద్ధంగా ముందుకు పోతున్నామని తెలిపారు.
నల్గొండ జిల్లాలో ఒకేరోజు మెడికల్ కళాశాల ప్రారంభించి పేదలకు వైద్యం, యాదాద్రి పవర్ ప్రాజెక్ట్ లో విద్యుత్ ప్రారంభించి విద్యుత్ ఉత్పత్తి, బ్రాహ్మణ వెళ్లేముల ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించి సాగునీరు ఒకేరోజు వైద్యం, విద్యుత్తు, సాగునీరు నల్లగొండ ప్రజానీకానికి అంకితం చేశామని తెలిపారు.