*సిపిని మర్యాద పూర్వకంగా కలిసిన ఏసీపీ*
వరంగల్, అక్షిత బ్యూరో:
వరంగల్ పోలీస్ కమీషనరేట్ పరిధిలోని పరకాల నూతన ఏసీపీ బాధ్యతలు చేపట్టిన సి. సతీష్ బాబు సోమవారం వరంగల్ పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝాను కమిషనర్ కార్యాలయములో మర్యాద పూర్వకంగా కలుసుకొని పూల మొక్కను అందజేశారు. ప్రజలు పోలీసులపై ఉన్న నమ్మకానికి తగ్గట్టుగానే నీతి నిజాయితీతో ప్రజలకు సేవలందించాలని పోలీస్ కమిషనర్ నూతన ఏసీపీకి సూచించారు.