●జంతర్ మంతర్ వద్ద తెలంగాణ పార్లమెంట్ సభ్యుల నిరసన
●పార్లమెంటు సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి
●మల్లు రవి
●నల్గొండ అక్షిత బ్యూరో
ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరసన వ్యక్తం చేసిన ఇండియా కూటమి ఎంపీలు మరియు మణిపూర్ ప్రజా ప్రతినిధులు ఈ కార్యక్రమంలో భువనగిరి ఎంపి చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ మణిపూర్ అల్లర్లు జరిగి నేటికి సంవత్సరం గడుస్తున్నప్పటికి దానిపై బీజేపీ ప్రభుత్వం కనీస చర్చ కూడా జరపడం లేదని దానికి గాను మణిపూర్ ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు.
పార్లమెంట్ లో మణిపూర్ అంశంపై కనీసం ఐదు నిమిషాల పాటు చర్చ జరపాలని డిమాండ్ చేశారు
ఈ నిరసన కార్యక్రమంలో తెలంగాణ ఎంపీలు డాక్టర్ మల్లు రవి, చామల కిరణ్ కుమార్ రెడ్డి,రామ సహాయం రఘురాం రెడ్డి ఇతర ఎంపీలు,ఇండియా కూటమి ఎంపీలు మాణిపూర్ ప్రజాప్రతినిధులు తదితరులు
పాల్గొన్నారు.