*మన “బతుకులు” ఛిద్రం చేసిర్రు…
తెలంగాణ తల్లి చేతిలో “బతుకమ్మను”మాయం చేసిర్రు
బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
మేడ్చల్, అక్షిత బ్యూరో :
బిఆర్ఎస్ మేడ్చల్ జిల్లా అధ్యక్షులు, శంభీపూర్ రాజు ఆధ్వర్యంలో ఈరోజు గండిమైసమ్మలోని మేడ్చల్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవము మరియు తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరై కార్యాలయ ప్రారంభోత్సవంతో పాటు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు.
కార్యక్రమంలో భాగంగా మొదట గండి మైసమ్మ చౌరస్తా నుంచి బిఆర్ఎస్ పార్టీ మేడ్చల్ జిల్లా కార్యాలయం వరకు డప్పు చప్పుళ్ళు, గిరిజన సోదరుల నృత్యాలతో భారీ ర్యాలీగా ఎమ్మెల్యే కెపి.వివేకానంద్, ఎమ్మెల్సీలు కేటీఆర్ కి స్వాగతం పలుకగా కార్యక్రమ వేదిక వద్ద మొదట తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ, బిఆర్ఎస్ పార్టీ మేడ్చల్ జిల్లా కార్యాలయాన్ని తెలంగాణ ఐటి ఐకాన్, మాన్యశ్రీ మాజీ మంత్రివర్యులు కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం గావించారు.
ఈ సందర్భంగా బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మాట్లాడుతూ…..
🔥 ఈ సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ తల్లి విగ్రహ ప్రాశస్త్యం తెలుసా అసలు. తెలంగాణ తల్లి రూపాన్ని చూసిన ఎవరైనా రెండు చేతులు ఎత్తి నమస్కరించే విధంగా ఉండేది. కానీ నేడు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ తల్లి అంటూ ఆవిష్కరించిన విగ్రహం తెలంగాణ తల్లి కాదు… కాంగ్రెస్ తల్లి.
🔥 ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలతో, అనుభవ రాహిత్యంతో మన బతుకులను చిత్రం చేశారు. తెలంగాణ తల్లి విగ్రహంలో బతుకమ్మను మాయం చేశారు.
🔥 భరతమాతకు కిరీటం ఉంటుంది. అలాగే మన తెలంగాణ తల్లికి కిరీటం ఉండకూడదా…? లంకె బిందెల కోసం వచ్చిన అని చెప్పే ఈ దొంగ ముఖ్యమంత్రి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎత్తుకు పోయిండు.
🔥 తెలంగాణ తల్లి విగ్రహంలో మన తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన సుప్రసిద్ధ కోహినూరు వజ్రాన్ని కూడా పెట్టి తెలంగాణ తల్లికి చూడంగానే దండం పెట్టే విధంగా ఆ తల్లికి రూపొందించడం జరిగింది.
🔥 మన తెలంగాణ ఉద్యమంలో 1952 నుంచి 2014 వరకు వందల, వేల చావులకు కారణమైన ఈ పాలకులు తమ మూర్ఖపు చర్యలతో తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారు. ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహంలో బతుకమ్మను మాయం చేశారు. రేపు భారతదేశంలో తెలంగాణ రాష్ట్రాన్నే మాయం చేయాలని చూస్తున్నారు.
ఇప్పటికైనా తెలంగాణ ప్రజలు మేలుకొని మూర్ఖపు చర్యలతో తెలంగాణ అస్తిత్వాన్ని ప్రశ్నార్థకంగా మారుస్తున్న ప్రభుత్వంతో అప్రమత్తంగా ఉండకుంటే మన బతుకులను ప్రశ్నార్థకంగా మారుస్తారు ఈ కాంగ్రెస్ నాయకులు.
తల్లి విగ్రహన్ని మార్చిన మూర్ఖులు
ఈ ప్రపంచంలో ఎక్కడ లేరు.
ఉద్యమ సమయంలో ప్రజలంతా స్వచ్ఛందంగా ఒక్కొక్క రూపాయి కూడా పెట్టి ఏర్పాటు చేసుకున్న తెలంగాణ తల్లి విగ్రహాలు ఈ రాష్ట్రంలో, దేశంలో వేలాది సంఖ్యలో ఉన్నాయి. ఎన్ని విగ్రహాలను మారుస్తావు రేవంత్ రెడ్డి.ప్రభుత్వాలు మారినప్పుడల్లా ప్రజల తలరాతలు మారాలి కానీ తల్లులు మారడం తప్పు.
కాంగ్రెస్ సన్నాసులు ఏ ఒక్క చరిత్రను మారుస్తా అనుకుంటున్నారు. మనం జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండకపోతే పెద్దలు చెప్తారు సింహాలు తమ గాధ తాము చెప్పుకోకపోతే వేటగాళ్లు చెప్పే పిట్ట కథలే చరిత్రగా మారుతాయి అని చెప్తారు.
ఇవాళ వేటగాళ్లు క్రూరమైన పరిహాసం ఎవరైతే తెలంగాణలో కాంగ్రెస్ నాయకులు చెప్పే మాటలు నిజం కావొద్దు అంటే ఎప్పటికప్పుడు తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని జాగృతం చేయాలి.
మేడ్చల్ లో మా తమ్ముడు రాజు, మరో తమ్ముడు వివేకు ఇంత శ్రమ తీసుకొని మిమ్మల్ని అందరిని ఒక దగ్గరికి తీసుకొచ్చి అద్భుతంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నారు.
పాలాభిషేకం చేద్దాం ఆ తల్లికి జరిగిన తప్పుకు క్షమాపణ అడుగుదాం. ఈ కాంగ్రెస్ మూర్ఖులకు చరిత్ర తెలవదు .ఈ సన్నాసులను క్షమించమని చెప్పాలంటే చాలా ఉన్నాయి.
ఎంత దొంగ మాటలు రేవంత్ రెడ్డి … రెండు లక్షల కంటే తక్కువనే లోన్లు ఉన్నాయి. రుణమాఫీ ఎంత అంటే మొత్తం తిప్పి తిప్పి కొడితే 18 కోట్ల తొంబై ఎనిమిది లక్షలు. ఆ రుణమాఫీని ఏదో నామమాత్రంగా చేసి రాష్ట్రంలోని రైతులందరికీ రుణమాఫీ చేశానని చెప్పుకుంటున్నావా…
రేవంత్ రెడ్డి సంవత్సరం నుంచి అంటే అదానీ కోసం, అల్లుని కోసం, అన్నదమ్ముల కోసం, బావమరిదికి రాష్ట్ర ఖజానాను పంచి పెడితున్నారు.
వచ్చే సంవత్సరం అనుముల అన్నదమ్ములు అంబానీని కూడా దాటిపోయే స్థాయికి తెలంగాణలో విచ్చలవిడిగా దోపిడీ చేస్తా ఉన్నారు. అందుకే మిమ్మల్ని సందర్భంగా కోరేది ఒక్కటే ఈ మోసగాలను నమ్మడానికి వీల్లేదు.
రేపు గ్రామపంచాయతీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు కావచ్చు ఆ తర్వాత వచ్చే శాసనసభ ఎన్నికలు కావచ్చు అప్రమత్తంగా ఉందాం.
మెంబర్షిప్ నుంచి మొదలుపెడితే అన్ని కార్యక్రమాలు కూడా చేసుకొని ఒకవైపు ప్రజలకండగా ఉంటూ ప్రజా పోరాటాల్లో కీలకపాత్ర పోషిస్తూ మరొకవైపు బ్రహ్మాండంగా పార్టీని నడుపుకుందాం.
ఈరోజు మేడ్చల్లో ఇంత బ్రహ్మాండమైన కార్యక్రమం నిర్వహించిన మా తమ్ముడు మేడ్చల్ జిల్లా పార్టీ అధ్యక్షుడు రాజుకి వారికి సహకరించిన ఎమ్మెల్యే కేపీ వివేక్ కి అందరికీ కృతజ్ఞతలు.
అనంతరం ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు, మేడ్చల్ జిల్లాకు ఎమ్మెల్యేలు కెపి. వివేకానంద్, మాధవరం కృష్ణారావు , మల్లారెడ్డి , మర్రి రాజశేఖర్ రెడ్డి , బండారి లక్ష్మారెడ్డి, మల్కాజ్గిరి పార్లమెంట్ ఇంచార్జ్ రాగిడి లక్ష్మారెడ్డి, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని శాలువాతో ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రంలోని బిఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు,మాజీ మంత్రులు, మాజీ ప్రజా ప్రతినిధులు, పలు మున్సిపల్ కార్పొరేషన్లకు చెందిన మాజీ మేయర్లు, కార్పొరేటర్లు మున్సిపాలిటీలకు చెందిన చైర్మన్లు, కార్పొరేటర్లు, వార్డు సభ్యులు, మహిళా నాయకురాలు, యువజన విభాగం నాయకులు, కార్యకర్తలు, బిఆర్ఎస్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు.