మహేష్ కుమార్ కు డిప్యూటి సీఎం ఇవ్వాలి

 డిప్యూటీ సీఎంగా బలహీన వర్గాలకు చెందిన టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ ని నియమించాలి

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి బీసీ నేత లింగంగౌడ్ విజ్ఞప్తి

హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అగ్రకులాలకు ముఖ్యమంత్రి పదవి దళితులకు డిప్యూటీ సీఎం పదవి కట్టబెట్టారని జనాభాలో 55% పైగా ఉన్న బీసీలకు కూడా డిప్యూటీ సీఎంగా అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగంగౌడ్ విజ్ఞప్తి చేశారు.

అధికారంలో ఉన్న లేకపోయినా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న బీసీ బిడ్డ ఎమ్మెల్సీ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ కు డిప్యూటీ సీఎంగా నియమించాలి. విద్యార్థి దశ నుండి విద్యార్థి యువజన నిరుద్యోగ సమస్యలపై పోరాడుతూ కాంగ్రెస్ పార్టీ అనుబంధ విద్యార్థి విభాగమైన ఎన్ ఎస్ యూఐ జిల్లా అధ్యక్షుడు నుంచి రాష్ట్ర అధ్యక్షునిగా స్వయంకృషితో అంచలంచెలుగా ఎదుగుతూ పార్టీ పటిష్టత కోసం గత 40 సంవత్సరాలుగా పనిచేస్తూ అపార అనుభవం ఎలాంటి మచ్చలేని వ్యక్తి మహేష్ గౌడ్ గారికి అధ్యక్ష పదవి ఇస్తే 55% ఉన్నటువంటి బీసీలకు న్యాయం చేసినట్ట వుతుందన్నారు. జనాభా దామాషా ప్రకారం పదవులు కేటాయిస్తామని చెపుతున్న కాంగ్రెస్ అధిష్ఠానం అది నిరూపించుకోవాలి.

Leave A Reply

Your email address will not be published.

Breaking