బిజెపితోనే దేశ భవిత… భద్రత
మండల అధ్యక్షులు రాయపురం కుమార స్వామి
వర్ధన్నపేట, అక్షిత ప్రతినిధి :
భారతీయ జనతా పార్టీ ద్వారానే గ్రామాలలో ప్రజలకు సంపూర్ణ న్యాయం జరుగుతుందని పార్టీ మరింత పటిష్టత కోసం బూతు స్థాయి నుంచి కార్యకర్తలు కృషి చేయాలని,వర్ధన్నపేట మండల బిజెపి అధ్యక్షులు రాయపురం కుమార స్వామి అన్నారు ఆదివారం రోజున వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలో సంస్థ గత నిర్మాణంలో భాగంగా బూత్ స్థాయి కమిటీలను ఎన్నుకున్నారు బిజెపి మండల అధ్యక్షులు రాయపూర్ కుమారస్వామి ఆధ్వర్యంలో ఇల్లంద గ్రామంలోని బూత్ నెంబర్ 219 ప్రస్తుతం 222 మారిన కమిటీని ఎన్నుకున్నారు. నూతన కమిటీకి అధ్యక్షులుగా వేల్పుల కార్తీక్, వర్థన్నపేట మండల సంయోజక్ జిల్లా ఉపాధ్యక్షులు పట్టాపురం ఏకాంతం భూత అధ్యక్షులకు శాలువా కప్పి సన్మానం చేశారు
ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు నాంపల్లి యాకయ్య. వర్ధన్నపేట మండల ఎన్నికల ఇన్చార్జి ఆకోజు సాంబయ్య. మండల ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి కృష్ణమూర్తి కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు కర్క సోమిరెడ్డి, మల్లెపాక దూడయ్య, జోగుల సంపత్, సట్ల అనిల్, మల్లెపాక రాజు తదితరులు పాల్గొన్నారు.