క్రైస్తవులకు అండగా కాంగ్రెస్ సర్కార్
ప్రతి ఇల్లు, హృదయం ఆనందంగా ఉండాలి
తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి
హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :
తెలంగాణ రాష్ట్రంలోని క్రైస్తవ సోదరులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పూర్తి భద్రత ,మద్దతు ఉంటుందని రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. ఆదివారం సాయంత్రం సికింద్రాబాద్ లో మార్థోమ చర్చిలో జరిగిన సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రంలో క్రైస్తవులకు భద్రతా మద్దతు విషయంలో ప్రభుత్వం కట్టుబడి ఉందన్న విషయాన్ని తెలియజేయమంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారని ఆ మేరకు ఆయన సందేశాన్ని మీకు తెలియజేస్తున్నానని మంత్రి వివరించారు. ప్రపంచంలో క్రైస్తవులు ప్రధానంగా విద్యా, వైద్యం విషయంలో నిస్వార్థ సేవలు అందిస్తున్నారని ఆయన చెప్పారు. కేవలం నామమాత్రపు రుసుముతో ఇటు విద్య అటు వైద్యాన్ని పేద ప్రజలకు చేరువ చేస్తున్నారని ఆయన కొనియాడారు.

అంతేకాకుండా ఇందిరమ్మ రాజ్యానికి క్రైస్తవులు మద్దతు ఎప్పుడు ఎప్పుడూ లభిస్తుందని ఆయన గుర్తు చేసుకున్నారు. వైఎస్ఆర్సిపి తరఫున తాను ఖమ్మం ఎంపీగా పోటీ చేసినప్పుడు క్రైస్తవులు పూర్తిగా మద్దతు పలికి సహకరించిన విషయాన్ని ఆయన మరోసారి గుర్తు చేసుకున్నారు. ఇందిరమ్మ రాజ్యం పేదల పక్షాన ఉంటుందని అటువంటి పేదలకు సేవలు చేసే క్రైస్తవులు సహకరించాలని ఆయన కోరుతూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దేశంలో 4500 కిలోమీటర్ల పాదయాత్ర చేశారని రానున్న కాలంలో ఆయన మరింత మరిన్ని ఉన్నత పదవులు అధిష్టించేలా క్రైస్తవులు ప్రార్థనలు చేయాలని మంత్రి పొంగులేటి కోరారు. 150 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ చర్చిలో జరిగే కార్యక్రమాలకు తను ఆహ్వానించడం సత్కరించడం మర్చిపోలేని మంత్రి తెలిపారు. ఈ క్రిస్మస్‌తో 2024కు గుడ్‌బై చెప్పి కొత్త సంవత్సరానికి ముందుగానే స్వాగతం పలుకుతూ – ప్రతి ఒక్కరు కొత్త సంవత్సరంలో ఒక నిర్ధిష్ట పని పూర్తికి సంకల్పం తీసుకునే అవకాశం క్రిస్మస్‌తో వచ్చిందని భావించాలని అన్నారు
ఏసు జన్మించిన ఈ పవిత్ర దినం.. క్రైస్తవ సోదర సోదరీమణులు ఎదురుచూసే గొప్పరోజు.. మనమంతా ఆ దేవుని పిల్లలం అని చెప్పారు
ఎందుకంటే..పిల్లల పాపాలను భరిస్తూ, ఉపశమింపజేస్తూ నిలిచే నిజమైన రక్షకుడు యేసు అని కీర్తించారు. బైబిల్ పట్టుకున్నవారో…చర్చికి వెళ్లి ప్రార్ధనలు చేసేవారో ఆ బైబిల్‌లో ఉన్న శాంతి. ప్రేమ, వాత్సల్యాల వంటి సందేశాలను అందరిపై చూపిస్తే వారి ఆరాధనకు అసలైన అర్దం లభిస్తుందని అన్నారు
శాంతికి, స్నేహానికి ప్రతిరూపంగా నిలిచే క్రిస్మస్ వేళ ప్రతి ఇల్లు, ప్రతి హృదయం ఆనందంలో నిండాలని
ఆ భగవంతుని కరుణా కటాక్షములు మీపై కురవాలని ప్రార్థిస్తున్నాను అని మంత్రి పొంగులేటి అన్నారు.