గ్రూప్-2 అభ్యర్థులకు హెల్ప్ లైన్ సెంటర్

గ్రూప్-2 అభ్యర్థులకు హెల్ప్ లైన్ సెంటర్
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
మిర్యాలగూడ పట్టణం మండలంలోని సుమారు 28పరీక్ష కేంద్రాలలో గ్రూప్ -2 పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల అనుమానాలు నివృత్తి చేసి, పరీక్ష కేంద్రాల అడ్రస్ లను తెలిపేందుకు మిర్యాలగూడ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండులో డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో హెల్ప్ లైన్ సెంటర్ ను ఏర్పాటు చేయడం జరిగిందని డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ఎం.రవినాయక్ తెలిపారు. హెల్ప్ లైన్ సెంటర్ వల్ల అభ్యర్థుల అనుమానాలు నివృత్తి చేయడంతో పాటు మిర్యాలగూడ పట్టణంలోని 28 పరీక్షా కేంద్రాల అడ్రస్ లను తెలిపారు. హెల్ప్ డెస్క్‌ ను అనేక మంది అభ్యర్థులు వినియోగించుకున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో యువతకు అనేక హామీలు ఇచ్చి విస్మరించిందన్నారు‌. అధికారంలోకి వచ్చిన ఏడాది లోపు రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి అరకొర ఉద్యోగాల నోటిఫికేషన్లతో సరిపెట్టుకోవడం తగదన్నారు. గత అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన జాబ్ క్యాలెండర్ లో ఖాళీ పోస్టుల సంఖ్య తెలపకపోవడం వల్ల ఖాళీ పోస్టుల భర్తీ ఏ విధంగా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. వెంటనే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న బ్యాక్ లాగ్ పోస్టులను భర్తీ చేయాలని లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడ్తామని హెచ్చరించారు. హెల్ప్ లైన్ సెంటర్ నిర్వహణ పట్ల అభినందనలు తెలిపి పాల్గొన్న మాజీ వైస్ ఎంపీపీ, ఐద్వా నాయకులు పాదూరు గోవర్దన, అరుణలకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో డీవైఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు పతాని శ్రీను, పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు యం.డి వదూద్, పల్లా భిక్షం, జిల్లా నాయకులు రామలింగయ్య, పట్టణ నాయకులు జీలకర నాగరాజు, పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking