ప్రతిష్ఠాత్మకంగా క్రిస్మస్ విందు వేడుకలు

ప్రతిష్ఠాత్మకంగా
క్రిస్మస్ విందు వేడుకలు

ప్రతి నియోజకవర్గానికి
రెండు లక్షలు, జిహెచ్ఎంసి పరిధిలో రూ.లక్ష

21న ఎల్బీ స్టేడియం వేడుకలకు సీఎం రేవంత్

పకడ్బందీగా
పోలీస్ బందోబస్తు

వాహనాల పార్కింగ్
కోసం ఆరు కేంద్రాలు

వేడుక పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలి

వాలంటరీలను నియమించాలి

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్

క్రిష్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ జాన్ కుక్కడన్

హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :

ఈ నెల 21 న హైదరాబాద్ ఎల్ బి స్టేడియంలో నిర్వహించు క్రిస్మస్ పండుగ విందు వేడుకలను ఘనంగా నిర్వహించాలని వచ్చే అతిధులు, ముఖ్య అతిధులకు ఇబ్బందులు కలగకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్, క్రిష్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ జాన్ కుక్కడన్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఎల్ బి స్టేడియం లో ఎస్ఎల్ఓసి సభ్యులు, పోలీస్, జిహెచ్ఎంసి, రెవెన్యూ, ఆర్అండ్ బి, సమాచార శాఖ, విద్యుత్ శాఖ, టిజిఆర్టిసి వైద్యశాఖ తదితర శాఖ అధికారులతో ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ నెల 21న సాయంత్రం ఎల్బీ స్టేడియంలో జరిగే క్రిస్టమస్ పండుగ విందు కార్యక్రమం, వేడుకల నిర్వహణపై నియమించిన రాష్ట్ర స్థాయి కమిటీలు, సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని దిశానిర్దేశ్యం చేసారు.

క్రిస్మస్ విందు కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు ముఖ్యతిధులుగా పాల్గొనుచున్నందున ఏర్పాట్లు పక్కాగా ఉండాలని సూచించారు. ఈ వేడుకల నిర్వాహణ జిహెచ్ఎంసి పరిధిలో 200 ప్రాంతాలలో అలాగే రూరల్ ప్రాంతాలలోని అసెంబ్లీ నియోజక వర్గాలలో 95 ప్రాంతాలలో వేడుకలు నిర్వహిస్తున్నామని ఎక్కడకూడా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా కమిటీల సూచనలు పరిగణలోకి తీసుకోని నిర్వహణ ఏర్పాట్లు పక్కాగా ఉండేలా చూడాలని సూచించారు. జిహెచ్ఎమ్ సి పరిధిలో వేడుకల నిర్వహణకు రూ. లక్ష అలాగే అసెంబ్లీ నియోజక వర్గాల పరిధిలో రూ.రెండు లక్షలు నిధులు మంజూరు చేయడం జరిగిందని అలాగే సికింద్రాబాద్ కాంటోన్మెంట్ లో చేపట్టే వేడుకలకు రూ. 10 లక్షలు మంజూరు చేయడం జరిగిందని పేర్కొన్నారు. వేడుకల నిర్వహణ సందర్బంగా మూడు రాష్ట్ర స్థాయి కమిటీలు ఏర్పాటు చేయడం జరిగిందని కమిటీల సూచనలు, సలహాలు పరిగణలోకి తీసుకోని అధికారులు సమన్వయంతో కలసి పనిచేయాలని సూచించారు. అదేవిదంగా వేడుకలలో పాల్గొనే క్రైస్తవ సోదరులకు వేడుకలలో పాల్గొనేందుకు వచ్చేందుకు 100 బస్సులు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. అదేవిదంగా అతిధులు, ముఖ్య అతిధులకు ఆహ్వానం ముందుగా అందాలని, నిర్వహణ వేడులలో నిరంతరం విద్యుత్, త్రాగునీరు అలాగే పారిశుధ్యం ఎప్పడికప్పుడు చేపట్టాలని పేర్కొన్నారు. స్టేడియం లోపల 20 మొబైల్ టాయిలెట్స్ వాహనాలు, అలాగే 100 తాత్కాలిక మరుగుదొడ్లు చేపట్టాలని అన్నారు. వేడుకల్లో పాల్గొనే వారికీ ఎక్కడకూడా ఇబ్బoదులు కలగకుండా ట్రాఫిక్ నియంత్రణతో పాటు పోలీస్ బందోబస్తూ పటిష్టంగా ఉండాలని సూచించారు. ఈ వేడుకలకు 30 నియోజక వర్గాలనుండి దాదాపు 10 వేల మంది క్రైస్తవులు పాల్గొంటారని వారికీ కేటాయించిన గ్యాలరీలలో పంపించాలని అలాగే ప్రోటోకాల్ తప్పక పాటించాలని సూచించారు. ఈ వేడుకల నిర్వహణ పై ఎక్కువ మొత్తంలో ప్రచారం ప్రజల్లో ప్రభావితం కావాలని సంబంధిత శాఖ నుండి మెటీరియల్ తీసుకోని ప్రచారం గావించాలని సూచించారు. అలాగే భోజనాలు ఫుడ్ సేఫ్టీ అధికారుల ద్వారా పరీక్షించాలని తెలిపారు. స్టేజ్ ఏర్పాట్లు ఘనంగా వచ్చే ఉండాలని, పూలతో సుందరీకరణ చేపట్టాలని అలాగే ప్రతి కౌంటర్ వద్ద తొక్కిసలట జరగకుండా ఫైల్ అధికారులు పోలీసులు, గైడ్ లను ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే వైద్యా శాఖా అంబులెన్సు లతో పాటు మెడికల్ శిబిరాలు చేపట్టాలని సూచించారు. కాలిగా ఈ వేడుకలకు వచ్చే బిషప్స్, పాస్టర్, క్రైస్తవ సోదరులను మర్యాదపూర్వకంగా వారి కేటాయించిన స్థలాలో కూర్చోబెట్టాలని సూచించారు. అగ్నిమాపక శాఖ అధికారులు వాహనాలతో అందుబాటులో ఉండాలన్నారు.

ఈ సమావేశంలో మైనార్టీ ఫైనాన్స్ ఎండి క్రాంతి వెస్లీ, సమాచార శాఖ కమిషనర్ డాక్టర్ హారీష్, ఉద్యాన వన శాఖ సంచాలకులు యాస్మిన్ భాష, క్రిష్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎoడి సబిత, , పోలీస్ అదనపు కమిషనర్ విక్రమ్ సింగ్ మాన్,
సమాచార శాఖ అదనపు సంచాలకులు డిఎస్ జగన్ మైనార్టీ సంక్షేమ అధికారి ఇలియాస్ అహ్మద్,ఆర్ డిఓ రామకృష్ణ, తహసీల్దార్ ప్రేమ్ కుమార్, ఇతర శాఖల అధికారులు, ఆర్గనైజర్ సైదా, ఎస్ఎల్ఓసి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking