అక్రమ కట్టడం… అనుమతుల్లేవ్

అక్రమ కట్టడం… అనుమతుల్లేవ్

వ్యాస స్కూల్ లో
విద్యార్థుల భద్రత కష్టం

కమీషనర్ కు మహేష్ ఫిర్యాదు

మేడ్చల్, అక్షిత బ్యూరో :
అక్రమ కట్టడం.. ఎలాంటి అనుమతుల్లేవ్ … విద్యార్థుల భద్రత కష్టతరం. అనుమతులు లేని వ్యాస స్కూల్ పై చర్యలు తీసుకోవాలని టిపీసీసీ కాంగ్రెస్ ఫిషర్ మెన్ కమిటి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా చైర్మన్ పోచి మహేష్ ముదిరాజ్ డిమాండ్ చేశారు. సోమవారం దుందిగల్ మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రాన్ని అందజేశారు. అక్రమ నిర్మాణoలో ఉన్న వ్యాస్ స్కూల్ విద్యా వ్యాపారం చేస్తూ విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తును అంధకారం చేస్తుందన్నారు. విద్యార్థుల తల్లి తండ్రుల నుంచి వేలాది రూపాయలు ఫీజులను ముక్కు పిండి వసూలు చేస్తున్నారని ఆరోపించారు.

ఎలాంటి మున్సిపల్ అనుమతులు లేకుండా విచ్చల విడి దందా సాగిస్తున్నారన్నారు. దుందిగల్ మున్సిపల్ పరిధిలోని బౌరంపేటలో ఉన్న వ్యాస్ స్కూల్ అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking