పరిశ్రమలతోనే
మాదిగల ప్రగతి
కొత్త కొత్త ఆవిష్కరణలకు ఊతం
మిక్కితో మాదిగల ఉన్నతి
-పసునూరి దయాకర్
వరంగల్, అక్షిత బ్యూరో :
ఉద్యోగాల అన్వేషణకు బదులుగా పరిశ్రమలు స్థాపించి ఉద్యోగాలిచ్చే స్థాయికి చేరుకోవాలని మాజీ ఎంపి పసునూరి దయాకర్ అన్నారు. శనివారం మాదిగ ఇంటిగ్రేటెడ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వారు నిర్వహించిన ఇంట్రెప్రెనేర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం పారిశ్రామిక అవగాహన సదస్సు హన్మకొండ నయీంనగర్ లోని ప్రెసిడెంట్ దాబాలో జరిగింది. ఈ సదస్సుకు మాజీ పార్లమెంటు సభ్యులు పసునూరి దయాకర్, ఒయాసిస్ విద్య సంస్థల అధిపతి జన్ను పరంజ్యోతిలు ముఖ్య అతిథులుగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్బంగా వారు ప్రసంగిస్తూ ప్రతి ఒక్కరూ ఉద్యోగాల గురించి కాకుండా స్వయం ఉపాధి మీద దృష్టి పెట్టి పారిశ్రామికవేత్తలుగా ఎదిగాలని ఆకాంక్షించారు.

పరిశ్రమలతోనే రాష్ట్ర, దేశ అభివృద్ధిలో పాలుపంచుకునే వీలుంటుందన్నారు. అదేవిధంగా దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే దిశగా తయారు కావాలన్నారు. కొత్త, కొత్త ఆవిష్కరణలతో రాష్ట్రాన్ని, దేశాన్ని ముందుకు తీసుకెళ్లే దిశగా యువత ముందుకు సాగాలన్నారు. సదస్సుకు మిక్కీ రాష్ట్ర అధ్యక్షులు సుంచు రాజ్ కుమార్ అధ్యక్షత వహించారు.

ఈ కార్యక్రమంలో కొండల్ రావు, బక్క దానయ్య, వీరేశం, కెనరా బ్యాంక్ మేనేజర్ సుందర్ నాయక్, యూనియన్ బ్యాంక్ సంగెం బ్రాంచ్ సీనియర్ మేనేజర్ అనిల్ కుమార్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఎంఎస్ఎం ఈ ఫ్యాకల్టీ మెంబర్ కోటేశ్వర రావు, డా.రామకృష్ణ, మిక్కీ రాష్ట్ర అధ్యక్షులు సుంచు రాజ్ కుమార్, ప్రధాన కార్యదర్శి బక్క నరసింహ, కోశాధికారి వి సత్యేంద్ర కుమార్, ఉపాధ్యక్షులు అవునూరు సుధాకర్, కార్యవర్గ సభ్యులు ఒగ్గు నగేష్, మిక్కీ ప్రతినిధులు గజ్జి దయాకర్, గాదెపాక అనిల్ కుమార్, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు విద్యార్థులు పాల్గొన్నారు.