చెస్ క్రీడతో మేధస్సు పెరుగుతుంది
*మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కర్నాటి రమేష్
*ఘనంగా ముగిసిన జిల్లా స్థాయి చెస్ పోటీలు *విజేతలకు బహుమతులు
*క్రీడాకారులకు 46 ప్రత్యేకంగా బహుమతులు అందజేత
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
చెస్ క్రీడతో మేధస్సు పెరుగుతుందని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కర్నాటి రమేష్. అన్నారు. డైమండ్ చెస్ అకాడమీ, అంతర్జాతీయ చెస్ క్రీడాకారిణి మాశెట్టి దివ్యశ్రీ ఆధ్వర్యంలో ఆదివారం ఉమ్మడి నల్గొండ జిల్లా స్థాయి చెస్ అండర్ 19 బాలబాలికల చెస్ టోర్నమెంట్ మిర్యాలగూడ ఐఎంఏ భవనంలో ఎమ్మెల్యే బిఎల్ఆర్ ప్రారంభించగా. ఆదివారం రాత్రి జిల్లా స్థాయి చెస్ పోటీలలో విజేతలకు బహుమతులను కర్నాటి రమేష్, నిర్వాహకులు లయన్స్ క్లబ్ మీల్స్ ఆన్ వీల్స్ ప్రోగ్రాం చైర్మన్ డైమండ్ శ్రీనివాస్, సీనియర్ జర్నలిస్ట్ ఖాజాహమీదుద్దీన్ లు అందజేశారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ చెస్ మేధో వికాసానికి పదును పెడుతుందన్నారు. చెస్ క్రీడాకారులు రాష్ట్ర జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించి మిర్యాలగూడ పట్టణానికి పేరు తీసుకురావాలన్నారు. నిర్వాహకులు డైమండ్ మాశెట్టి శ్రీనివాస్, మాశెట్టి గీతలు మాట్లాడుతూ మేధస్సుకు మేత చదరంగమని అన్నారు. చదరంగం క్రీడాకారులు విద్యలో కూడా ముందుంటారన్నారు. చెస్ క్రీడను అభివృద్ధి చేయడంతో పాటు క్రీడాకాలను తమ వంతు ప్రోత్సహిస్తామన్నారు. అంతర్జాతీయ చెస్ క్రీడాకారిణి మాశెట్టి దివ్యశ్రీ మాట్లాడుతూ అండర్- 19 ఉమ్మడి నల్గొండ జిల్లా స్థాయి చెస్ పోటీలకు అపూర్వ స్పందన లభించిందని సుమారు 80 మంది క్రీడాకారులు పాల్గొన్నారని తెలిపారు. అదేవిధంగా అండర్-7, అండర్-9, అండర్-11, అండర్- 13, అండర్-15, అండర్-17, అండర్-19, బాల, బాలికల చెస్ క్రీడాకారులకు వేర్వేరుగా బాలికలకు 23, బాలురులకు 23, మొత్తం 46 బహుమతులు అందజేశామని తెలిపారు. చెస్ క్రీడాకారులకు, కుటుంబ సభ్యులకు మధ్యాహ్న భోజన వసతిని రాజేందర్ కిరాణం షాప్ యజమాని రాజేందర్ కల్పించారు. కార్యక్రమంలో అఖిల, మాశెట్టి ధర్మతేజ, చెస్ అంతర్జాతీయ క్రీడాకారిణి అంకితగౌడ్, అరవింద్, మౌనిక, చెస్ అసోసియేషన్ నల్గొండ జిల్లా కార్యదర్శి కర్ణాకర్రెడ్డి, వెంకటాచార్యులు, రమ్య, మానస, ప్రియా, కిట్టు, పండు, సిద్దు, ఎస్వి మోడల్ హైస్కూల్ కరస్పాండెంట్ ఓరుగంటి శ్యాంసుందర్ పాల్గొన్నారు.