ఎమ్మెల్సీగా గెలిపిస్తే విద్యా వ్యవస్థలోని సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తా
–పీఆర్టీయూ తెలంగాణ ఉమ్మడి ఖమ్మం – నల్లగొండ – వరంగల్ జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థి గాల్ రెడ్డి హర్ష వర్ధన్ రెడ్డి
ఖమ్మం /అక్షిత బ్యూరో :
త్వరలో జరగబోయే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించినట్లతె విద్యా రంగంలోని ప్రతి సమస్యని పరిష్కరించేందుకు కృషి చేస్తానని టీ జేఏసీ (36 సంఘాలు) బలపరిచిన పిఆర్టియు తెలంగాణ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు, టీపీసీసీ అధికార ప్రతినిధి గాల్ రెడ్డి హర్ష వర్ధన్ రెడ్డి అన్నారు. ఖమ్మం నగరం లోని రామకృష్ణ ఫంక్షన్ హాల్ లో పీఆర్టీయూ తెలంగాణ ఖమ్మం జిల్లా శాఖ అద్యక్షుడు కొమ్మినేని అనిల్ కుమార్ అధ్యక్షతన జరిగిన విద్యా రంగం లోని సమస్యలు – ప్రభుత్వము చే పరిష్కరింపబడె మార్గాలు అనే అంశంపై జరిగిన మీటింగు లో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా తనను గెలిపిస్తే సర్వీస్ రూల్స్ తయారు చేయించి గతంలో ఆగిపోయిన పదోన్నతులు ప్రతి ఉపాధ్యాయనికి దక్కే విధంగా కృషి చేస్తానని అన్నారు. సిపిఎస్ ను రద్దు చేయించి ఓపిఎస్ ను యిచ్చే విదంగా శత విధాల ప్రయత్నం చేస్తాను గతంలోనే ఇట్టి అంశంపైన పూర్తి స్థాయిలో పని చేసి మ్యానిఫెస్టోలో పెట్టించడం జరిగిందని తెలిపారు.మిగిలిపోయిన భాషా పండితులు పిఈటిలకు పదోన్నతులు ఇప్పించేందుకు కృషి చేస్తానని ప్రతి సంవత్సరం విధిగా బదిలీలు పదోన్నతులు జరిగే విదంగా కృషి చేస్తానన్నారు.ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ కొరకు కార్డు ను ప్రతి కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఉచిత వైద్యం అందే విధంగా కృషి. పాఠశాలల్లో విధిగా ఆటలు అడీన్చేందుకు ప్రతి పాఠ్య పుస్తకo లో ఆటలు కోసం ప్రతి తరగతికి గంట సమయం కేటాయించేలా సమయం ఇప్పిస్తను అన్నారు. సర్వ శిక్ష అభియాన్ ఉద్యోగులను విద్యాశాఖలో విలీనం చేసేందుకు కృషి చేస్తానని అన్నారు.ఈ కార్యక్రమంలో ఆర్టిఓ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గార్లపాటి ఉమాకర్ రెడ్డి ఎస్ఎల్టిఏ రాష్ట్ర అధ్యక్షులు చక్రవర్తులు శ్రీనివాసచారి ఉమ్మడి ఖమ్మం నల్గొండ వరంగల్ ఎమ్మెల్సీ ప్రచార కమిటీ ఇంచార్జి పాయిల్ రమేష్ పిఆర్టియూ తెలంగాణ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు ఓం ప్రకాష్ హరి ప్రసాద్ పోట్ల నాగేశ్వరావు దుబ్బాకుల శ్రీనివాసరావు ఎస్ ఎల్ టి ఏ రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు సుదర్శనాచారి పిఆర్టియు తెలంగాణ ఖమ్మం జిల్లా శాఖ ప్రధాన కార్యదర్శి ముత్తినేని సురేష శిరీష వీరేంద్ర తదితరులు పాల్గొన్నారు.