అమ్మకానికి
ఎమినిటీ స్థలం
లహరి గ్రీన్ పార్క్ లేఔట్ లో
ఎమినిటీస్ స్థలాలను తక్షణo స్వాధీనం చేసుకోవాలి
నిర్మాణం అనుమతులు
రద్దు చేయాలి
ఎమినిటీస్ స్థలం
కాలనీ అవసరాలకు వినియోగించాలి
మున్సిపల్ కమిషనర్ కు ఫిర్యాదు
బిజెపి నాయకులు ఆకుల సతీష్
మేడ్చల్, అక్షిత బ్యూరో :
దుండిగల్ పురపాలక పరిధి బౌరంపేట్ గ్రామంలో లహరి గ్రీన్ పార్క్ లేఔట్ నందు 2314 గజాల కాలనీ అవసరాల కోసం ఎమ్యూనిటీ స్థలాన్ని అక్రమంగా అమ్మకానికి ఒడిగట్టారు. హెచ్ఎండిఏ నుంచి అనుమతి తెచ్చుకొని స్కూలు నిర్మిస్తున్న ఎమినిటీస్ స్థలాలను తక్షణo స్వాధీనం చేసుకోవాలని, నిర్మాణం అనుమతులు రద్దు చేయాలని,ఎమినిటీస్ స్థలం కాలనీ అవసరాలకు వినియోగించాలని దుండిగల్ మున్సిపల్ కమిషనర్ కి పూర్తి ఆధారాలతో ఫిర్యాదు చేయడం జరిగింది.

ఈ సందర్భంగా బీజేపీ నేత ఆకలి సతీష్ మాట్లాడుతూ సర్వే నెంబర్ 541, 542,543,544,545,546,547,548,554,555,561, నందు ప్లాట్ నెంబర్స్ 865A,865B, 866A, 866B, 867&868 బరంపేట గ్రామం నందు లహరి గ్రీన్ పార్క్ లేఔట్ 99.825 ఎకరాల విస్తీర్ణం లో వేయడం జరిగింది. లహరి గ్రీన్ పార్క్ లేఅవుట్ నందు ఓపెన్ స్పేస్ ఏరియా 8.181 ఎకరాలు మరియు కమర్షియల్ ఏరియా 2.397 ఎకరాలు, ఎమినిటీ స్థలం 0.572(2768) మరియు రోడ్డు 28.527 ఎకరాలు మరియు మిగిలిన 60.148 ప్లాటింగ్ ఏరియాగా చేయడమే కాకుండా 865 ప్లాట్లతో లహరి గ్రీన్ పార్క్ వెంచర్ హరిబాబు తదితరులు వేయడం జరిగింది.

కానీ ఈ వెంచర్ సంబంధించిన పూర్తి వివరాలు గ్రామ పంచాయతీకి మరియు హెచ్ఎండిఏ అందజేయడం జరిగింది. కానీ ఒక్కసారి ప్లాటిoగ్ వేసిన తర్వాత లహరి గ్రీన్ పార్క్ సంబంధించిన ఓపెన్ స్పేస్ కమర్షియల్ ఏరియాకి సంబంధించిన అమ్మకాలు మరియు అభివృద్ధి గాని మరియు లీజుకి ఇవ్వడం గాని పూర్తిగా అసోసియేషన్ కు మాత్రమే అధికారం ఉంటుంది. కానీ విచిత్రమైన విషయం ఏమనగా లహరి గ్రీన్ పార్క్ వెంచర్ వేసిన హరిబాబు మరియు మిగతా 11 మంది లారీ గ్రీన్ పార్క్ కు చెందిన ఎమినిటీస్ స్థలం 2,314 గజాల స్థలం ప్రైవేట్ వ్యక్తులకి అమ్మడమే కాకుండా ఇటీవల కాలంలో కొనుగోలు చేసిన వ్యక్తులు కాలనీకి చెందిన ఎమినిటీ స్థలం నందు హెచ్ఎండిఎ నుంచి స్కూలు నిర్మాణం కోసం అనుమతి((Appl no.002473/BP/HMDA/0501/MED/2023) తీసుకోవడం జరిగింది. ఈ విధంగా లాహారీ గ్రీన్ పార్క్ వెంచర్ వేసిన హరిబాబు మిగతా 11 మంది కాలనీ అసోసియేషన్కు చెందాల్సిన కొన్ని పార్కులు/ కమర్షియల్ స్థలాలు కూడా ఆమ్మకం నిబంధనలకు విరుద్ధంగా చేయడం జరిగింది. లహరీ గ్రీన్ పార్క్ సంబంధించి పార్కులు కమర్షియల్ ల్యాండ్స్ ఎమినిటీ స్థలాలపై గతంలోని ఫిర్యాదు పూర్తి ఆధారాలతో చేయగా కమిషనర్ తూతూ మంత్రంగా కొన్ని పార్క్ స్థలాలు నందు బోర్డులు పెట్టించడం జరిగింది కానీ, పార్కు విస్తీర్ణం మొత్తం శుభ్రం చేసి ఫెన్సింగ్ వేయకుండానే కొన్ని పార్క్ స్థలాలు మరియు కమర్షియల్ స్థలాల నందు భవనాలు వచ్చిన వాటిపై చర్యలు తీసుకోకుండా సహకరించడంపై పలు అనుమానాలు కలుగుతున్నాయి. కావున తక్షణమే లారీ గ్రీన్ పార్క్ సంబంధించిన ఓపెన్ స్పైసెస్/ పార్కులు/ ఎమినిటీ స్థలాలు కమర్షియల్ స్థలాల పై పూర్తి స్థాయిలో సర్వే చేసి, అక్రమ నిర్మాణాలను తొలగించి ఈ స్థలాలను కాపాడి ప్రజా అవసరాలకు వినియోగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పీసరి కృష్ణారెడ్డి, సువాసిని శక్తి, అరుణ్ రావు, ఈశ్వర్ రెడ్డి, తోట రాజు తదితరులు పాల్గొన్నారు.