టీయూడబ్ల్యూజే సహకారాన్ని మరచిపోం

*టీయూడబ్ల్యూజే
సహకారాన్ని మరచిపోం

*హైదరాబాద్ జర్నలిస్ట్స్ హౌజింగ్ సొసైటీ నూతన బాధ్యుల కృతజ్ఞతలు*

హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :

వారం రోజుల క్రితం హోరా హోరీగా జరిగిన సొసైటీ కార్యవర్గ ఎన్నికల్లో తమ ప్యానల్ కు సంపూర్ణ మద్దతునిచ్చి, గెలుపుకు కృషి చేసిన తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘంకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్లు హైదరాబాద్ జర్నలిస్ట్స్ మ్యూచువల్ కో-ఆపరేటివ్ హౌజింగ్ సొసైటీ నూతన బాధ్యులు పేర్కొన్నారు.
గురువారం నాడు ఆ సొసైటీ నూతన అధ్యక్ష, కార్యదర్శులు గోపరాజు, రవీంద్రబాబులు బషీర్ బాగ్ లోని టీయూడబ్ల్యూజే కార్యాలయంలో యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కె.విరాహత్ అలీని మర్యాదపూర్వకంగా కలుసుకొని కృతజ్ఞతలు తెలిపారు. తమపై సంఘం ఉంచిన విశ్వాసాన్ని వమ్ము చేయకుండా సొసైటీ సభ్యులకు న్యాయం చేసేందుకు అవిశ్రాంతంగా శ్రమిస్తామని హామీ ఇచ్చారు. తమకు యూనియన్ సలహాలు, సహకారం అవసరమని వారు కోరగా, ట్రేడ్ యూనియన్ స్ఫూర్తితో పనిచేస్తూ ముందుకెళ్లాలని విరాహత్ అలీ వారిని సూచించారు. ఈ కార్యక్రమంలో హెచ్ యూజే అధ్యక్షుడు శిగా శంకర్ గౌడ్ కూడా పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking