దళితులపై ముస్లింల దాడులు..
ధళిత కుటుంబంపైన కక్ష సాధింపు అర్ధరాత్రి ఇంటిపై దాడి ..
శేరిలింగంపల్లి, అక్షిత ప్రతినిధి :
దౌర్జన్యంగా ఇంటిలోకి ప్రవేశించి భార్యా పిల్లల ముందే పిడిగుద్దులు కందిపోయోలా కొట్టిన దుర్మార్గులు చాతిపైన రక్త గాయాలతో సొమ్మసిల్లి పడి పోయిన ప్రభాకర్ వివరాల్లోకి వెళితే జనవరి 13 2025 వ తేదీ ఆదివారం రాత్రి దాదాపు 11 పదకొండు గంటల సమయంలో శేరిలింగంపల్లి నియోజకవర్గం కొండాపూర్ డివిజన్ ప్రేమ్ నగర్ బి బ్లాక్ లో కక్ష సాధింపు చర్యకు పాల్పడిన ముస్లిం కుటుంబం దళిత కుటుంబ యజమాని ప్రభాకర్ ను వారి భార్యా పిల్లలను ఈడ్చుకుంటూ కొట్టిన ముస్లిం కుటుంబ సభ్యులు ఐదుగురు అన్నదమ్ములు వారి తల్లి కలిసి దారుణంగా సభ్య సమాజం తలదించుకునేలా దాడి చేయటం జరిగింది పిల్లల కేకలు విని కాలనీలో ఉండే చుట్టు పక్కల వారు భయభ్రాంతులకు గురయ్యారు.ధళిత కుటుంబం పైన జరిగిన దాడిని ఖండిస్తూ తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీహరి మాట్లాడుతూ ఇందిరమ్మ రాజ్యం లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా పాలనలో దళితులపై దాడులు దౌర్జన్యాలు జరుగుతున్నాయి అని పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు దాడులు చేసిన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలి అని కోరారు.
తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు మమత మాట్లాడుతూ మాదిగ కులానికి చెందిన ప్రభాకర్ మరియ వారి భార్యా పిల్లలపై జరిగిన దాడి మాదిగ జాతిపై జరిగిన దాడి అన్నారు తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నడిబొడ్డున కూడా మాదిగలకు రక్షణ లేకుండా పోయిందన్నారు ప్రభాకర్ కుటుంబంపై దాడికి పాల్పడి పిడిగుద్దులతో రక్తం వచ్చేలా కొట్టడం కులం తక్కువ నా కొడుకా అని ధూషించటం ఇష్టానుసారంగా తిట్టడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు.
దాడికి పాల్పడిన ముస్లిం కుటుంబంపై ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి మాదిగ ప్రభాకర్ కుటుంబానికి న్యాయం చేయాలని తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు మమత కోరారు