క్రీడలతో మానసిక ఉల్లాసం

*క్రీడలు శారీరక,మానసిక దృఢత్వాన్ని పెంపొందిస్తాయి*

*యస్ఐ. జి అజయ్ కుమార్*

నడిగూడెం, అక్షిత న్యూస్:

మండల కేంద్రంలో సంక్రాంతి పండుగ పర్వదినం పురస్కరించుకొని ఎలుగూరి వెంకటేశ్వర్లు యువసేన ఆధ్వర్యంలో నడిగూడెం, మునగాల మండలాల స్థాయి వాలీబాల్,షాట్ పుట్ పోటీలను ప్రభుత్వ జూనియర్ కళాశాల నడిగూడెంలో ఎస్ఐ జి. అజయ్ కుమార్ మంగళవారం ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ క్రీడలు శారీరక దృఢత్వాన్ని పెంపొందిస్తాయని, మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని తెలిపారు. పండుగను పురస్కరించుకొని క్రీడలు నిర్వహిస్తున్న ఎలుగూరి వెంకటేశ్వర్లు యువసేన సభ్యులను, బహుమతి దాతలను ఈ సందర్భంగా అభినందించారు.ఈ కార్యక్రమంలో నాయకులు గుండు శ్రీనివాస్, దున్నా శ్రీనివాస్, వేపూరి సుధీర్, పల్లపు శీను, వల్లెపు శీను, మేకల గంగరాజు, దున్న ప్రవీణ్, గుంజా తిరుమలెష్, మాధవరావు, మురళి, నిర్వాహకులు కిరణ్, సతీష్, నాగేశ్వరరావు ప్రకాష్, రమేష్, ఇంతియాజు, శ్రీను, నాగరాజు,ఉపేందర్, గోపి పాల్గొన్నారు…

Leave A Reply

Your email address will not be published.

Breaking